Ram charan : భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్కో సినిమాకి ఎంత తీసుకోనున్నాడో తెలుసా?
NQ Staff - December 25, 2021 / 09:19 PM IST

Ram charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తన రేంజ్ పెంచేశాడు. సినిమాల విషయంలోను అలానే రెమ్యునరేషన్ విషయంలోను తగ్గేదే లే అంటున్నాడు. రానున్న రోజులలో పాన్ ఇండియా సినిమాలను చేయనుండగా, అదే తరహాలో మార్కెట్ కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఎక్కువగా అన్ని భాషల వారికి నచ్చే విధంగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు..

ram charan
ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తుండగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కూడా త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అలాగే సినిమా టైటిల్ పై కూడా వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వాలని దర్శకుడు శంకర్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఇటీవల గౌతమ్ తిన్ననూరి తో కూడా ఓ సినిమా చేసేందుకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
నిర్మాత అల్లు అరవింద్ సలహామేరకు గౌతమ్ చెప్పిన కథను విన్న రామ్ చరణ్ సింగిల్ సిట్టింగ్ లోనే ఆ కథను ఓకే చేశాడట.గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాతో మంచి దర్శకుడిగా గుర్తింపు పొందుతున్నాడు. ఇక అదే కథను ప్రస్తుతం షాహిద్ కపూర్ తో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ ఎవరితో వర్క్ చేస్తాడు అనేది ఇంకా అఫీషియల్ గా వెలువడలేదు.

ram charan
ఆర్ఆర్ఆర్ తర్వాత తనకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రతి సినిమాకు తన రెమ్యునరేషన్‌ని వంద కోట్లకు ఫిక్స్ చేశాడట. దీంతో నిర్మాతలు ఖంగుతింటున్నారు. శంకర్ సినిమాతో పాటు గౌతమ్ తిన్ననూరి సినిమాకు వంద కోట్లు రామ్ చరణ్ తీసుకోనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
రానున్న రోజులలో రామ్ చరణ్… కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కూడా సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదివరకే ఒకసారి ప్రశాంత్ నీల్ , రామ్ చరణ్ – మెగాస్టార్ చిరంజీవి ని ప్రత్యేకంగా కలుసుకున్నాడు అయితే అప్పుడు మాత్రం సినిమా చేస్తున్నట్లు క్లారిటీ కూడా ఇవ్వలేదు.. కానీ రెండు కథల పై మాత్రం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ram charan
రామ్ చరణ్ తేజ్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ మళ్లీ ఆ కథలలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ అయితే దర్శకుడి పై నమ్మకంతో రెండు కథల పై కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయని అన్నాడట. కానీ ఎక్కువగా ఒక యాక్షన్ స్టోరీ బాగా నచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు ఆ కాన్సెప్ట్ కూడా KGF తరహాలోనే ఉంటుందని ఎన్టీఆర్ సినిమా తర్వాత వీలైతే రామ్ చరణ్ తోనే చేసే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది.