Ram Charan : రామ్ చ‌ర‌ణ్ హెయిర్ స్టైలిస్ట్ రోజుకు ల‌క్ష‌ల‌న్న‌ర వ‌సూలు చేస్తున్నాడా..!

Ram Charan : మెగా ప‌వర్ స్టార రామ్ చ‌రణ్ రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ పూర్తి చేసుకొని ప్ర‌స్తుతం శంక‌ర్ సినిమాతో బిజీ అయ్యాడు. ఈ సినిమా ఇప్ప‌టికే ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సినిమాకి సంబంధించిన ఏ వార్త అయిన నిమిషాల‌లో వైర‌ల్ అవుతుంది. భారీ బ‌డ్జెట్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం శంక‌ర్ కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాడ‌ట‌. కాన్సెప్ట్ పోస్టర్ కోసమే కోటిన్నరకు పైగా ఖర్చు చేయించారట ఈ బడా దర్శకుడు.

ram charan hair stylish big remuneration
ram charan hair stylish big remuneration

ఇదిలా ఉంటే సినిమాలో హైలైట్ అయ్యేలా ఓ సీన్ ప్లాన్ చేసిన ఆయన, అందుకోసం బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గొద్దని నిర్మాతలకు సూచించారట.ఈ సినిమా కోసం భారీ ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారని, అయితే అందులో ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా చాలా ప్రత్యేకంగా ఉండనుందని తెలుస్తోంది. 7 నిమిషాల పాటు సాగే ఈ ఒక్క ఫైట్ కోసం దాదాపు 70 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని, స‌మాచారం.

ram charan hair stylish big remuneration
ram charan hair stylish big remuneration

ఇక రామ్ చ‌ర‌ణ్ కోసం ప్ర‌త్యేకంగా హెయిర్‌స్టైలిస్ట్‌ల‌ను తెప్పిస్తున్నాడ‌ట‌. ముంబై నుండి హైద‌రాబాద్ కి వ‌చ్చే ఈ స్టైలిస్ట్‌లు రోజుకి లక్ష కంటే ఎక్కువ వసూలు చేస్తారు మరియు వారి విమాన ఛార్జీలు ,వ‌సతికి అదనపు ఖర్చు అవుతుంది. రామ్ చరణ్ మరియు శంకర్ ల పాన్-ఇండియన్ సినిమాకి, హెయిర్ స్టైలిస్ట్ బిల్లు ల‌క్ష‌ల‌లో ఉన్న‌ట్టు టాక్.

రామ్ చరణ్ హెయిర్ స్టైలిస్ట్ ప్రతి రోజు రూ. 1.5 లక్షలు తీసుకుంటాడట‌. అతనితో పాటు ముగ్గురు సహాయకులు ఇందులోకి వస్తారు. బిజినెస్ క్లాస్ టిక్కెట్లు, ఫైవ్ స్టార్ హోటల్ వసతి ఇవ‌న్నీ అద‌న‌పు ఖ‌ర్చు . షూటింగ్ పూర్తయ్యే సరికి కోటి రూపాయల వరకు బిల్లు వారికే అవుతుంది.

ఈ పాన్ ఇండియా సినిమా కోసం 200 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారని సమాచారం. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ నుంచి రాబోతున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కానని దిల్ రాజు కూడా ఫిక్సయ్యారట.