ఆ విషయంలో ప్రభాస్ నన్ను నామినేట్ చేసాడు : రామ్ చరణ్
Admin - November 8, 2020 / 04:53 PM IST

తెలంగాణాలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ ఏర్పాటు చేసిన ‘ గ్రీన్ ఛాలెంజ్ ‘ ను టాలీవుడ్ నటీనటులు టాస్క్ గా తీసుకోని మొక్కలు నాటుతున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది మొక్కలు నాటారు. ఇదే తరుణంలో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మోకాలు నాటాడు. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్ ఏర్పాటు చేసిన ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొనటం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే చాలామంది నటులు ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారని, నేను కాస్త ఆలస్యంగా పాల్గొన్నానని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా డార్లింగ్ ప్రభాస్ నన్ను నామినేట్ చేసాడని అందుకొసమే సంతోష్ తో మొక్కలు నాటానని వెల్లడించాడు.