Lokesh : విక్ర‌మ్ డైరెక్ట‌ర్‌ని సంప్ర‌దించిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఇంట్రెస్టింగ్‌గా మారిన వార్త‌

NQ Staff - June 13, 2022 / 11:10 AM IST

Lokesh :  విక్ర‌మ్ డైరెక్ట‌ర్‌ని సంప్ర‌దించిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఇంట్రెస్టింగ్‌గా మారిన వార్త‌

 

Lokesh : ఇటీవ‌ల కాలంలో యువ ద‌ర్శ‌కులు స‌త్తా చాటుతున్నారు. స్టార్ హీరోల‌తో కొత్త కుర్రాళ్లు చేస్తున్న ప్ర‌యోగాలు స‌క్సెస్ అవుతున్నాయి. తాజాగా యువ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్.. క‌మ‌ల్ హాస‌న్‌తో విక్ర‌మ్ అనే సినిమా చేశారు. భారీ మల్టీస్టారర్ సినిమాగా విక్రమ్ ను లోకేష్ కనగరాజ్ ఢీల్ చేసిన విధానం ఇప్పుడు ఆడియన్స్ నే కాదు, ఫిలిం మేకర్స్ ను కూడా ఎట్రాక్ట్ చేస్తోంది.

మెగా మాస్‌గా ఉంటుందా..

ఇప్పటి వరకూ ఈ యంగ్ డైరెక్టర్ చేసినవి నాలుగు సినిమాలే అందులో ఖైది, మాస్టర్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. దాంతో లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే విక్రమ్ సినిమాలో విక్రమ్ 2, లేదా ఖైదీ 2 ఉండొచ్చు అని లీడ్ ఇచ్చి వదిలేశాడు. విక్రమ్ సక్సెస్ తర్వాత మాగ్జిమమ్ ఆడియన్స్ ఆ జోష్ లో లోకేష్ కనగరాజ్ విక్రమ్ 2 లేదా ఖైదీ2 చేస్తారని అనుకుంటున్నారు.

లోకేష్ మాత్రం ఖైదీ తర్వాత మాస్టర్ ఛాన్స్ ఇచ్చిన తమిళ స్టార్ తళపతి విజయ్ 67వ సినిమాను పట్టాలెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం విజయ్, వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా అయిపోయిన వెంటనే లోకేష్ కనగరాజ్ తో రెగ్యులర్ షూట్ లో పాల్గొనబోతున్నట్టు సమాచారం. విజయ్ 67వ సినిమా కు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్ వర్క్ చేస్తున్నారు అతి త్వరలోనే విజయ్ 67వ సినిమా టైటిల్ అనౌన్స్ ఉంటుందని ఆశిస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.

RamCharan-LokeshKanagaraj_

ఇప్పటి వరకు నాలుగంటే నాలుగే సినిమాలు చేసి, గ్రాడ్యుయల్ గా సక్సెస్ రేట్ పెంచుకుంటూ పోతున్నాడు లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం విక్రమ్ తో ఆయన కి పాన్ ఇండియా రేంజ్ లో మంచి పేరొచ్చింది. విజయ్ 67వ సినిమాతో సౌత్ ఇండియా క్రేజీ హీరో విజయ్ ని కూడా పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్తాడని విజయ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అలాగే లోకేష్ కనగరాజ్ కి ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ కూడా అడ్వాన్స్ ఇచ్చారని సమాచారం.

రామ్ చరణ్ తో లోకేష్ సినిమా ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ఒక వేళ ఈ సినిమా ఉంటే విజయ్ సినిమా తర్వాత విక్రమ్ కి సీక్వెల్ తీసి ఆ తర్వాత రామ్ చ‌ర‌ణ్‌తో చేస్తాడ‌ని తెలుస్తుంది. ఈ సినిమా మెగా
అభిమానుల‌కి మాంచి కిక్ ఇచ్చే సినిమాగా ఉంటుంద‌ని స‌మాచారం.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us