Ram Charan : మా నాన్న చేసిన పనికి ఇప్పటికీ ఈఎంఐలు కడుతున్నా.. రామ్ చరణ్ కామెంట్లు వైరల్..!
NQ Staff - March 13, 2023 / 10:19 AM IST

Ram Charan : రామ్ చరణ్ ఇప్పుడు యూఎస్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఆస్కార్ నామినేషన్స్ కోసం నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన సందర్భంగా త్రిబుల్ ఆర్ మూవీ టీమ్ మొత్తం యూఎస్ లో ఉంటూ ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా అక్కడ పలు టాక్ షోలోల పాల్గొంటున్నాడు రామ్ చరణ్. ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. సాధారణంగా సెలబ్రిటీల ఇంట్లో విచ్చల విడిగా డబ్బులు ఇస్తారని అనుకుంటారు. కానీ మా నాన్న అలా చేయలేదు. మాకు చిన్నప్పటి నుంచే డబ్బుల విలువ ఏంటో తెలిసేలా పెంచారు. ఆయన అలా పెంచడం మూలానే మేము చాలా క్రమశిక్షణతో పెరిగాం.
నేను కొనుక్కుంటున్నా..
అందుకే నాకు డబ్బుల విలువ ఏంటో బాగా తెలుసు. అందుకే నాకు సంబంధించిన ప్రతీదీ నేనే కొనుక్కుంటున్నాను. కాబట్టే నేను ఇప్పటికీ ఈఎమ్ఐలు కడుతున్నాను అంటూ ఆశ్చర్యకర కామెంట్లు చేశాడు రామ్ చరణ్. ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక ఈరోజే ఆస్కార్ నామినేషన్స్ జరగబోతున్నాయి. రెడ్ కార్పెట్ పై త్రిబుల్ ఆర్ మూవీ టీమ్ నడవబోతోంది. నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే మొదటిసారి మన తెలుగు వారికి ఆస్కార్ అవార్డు దక్కినట్టు అవుతుంది.