Ram Charan: అల్లు ఫ్యామిలీ ఓటీటీ కాకుండా.. వేరే ఓటీటీ కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా రామ్ చరణ్!

Ram Charan: ఈ కాలం నాటి సెల‌బ్రిటీలు కేవ‌లం సినిమాల‌తోనే స‌రిపెట్టుకోకుండా బిజినెస్‌లు కూడా చేస్తున్నారు. మ‌హేష్‌, అల్లు అర్జున్ వంటి వారు థియేట‌ర్స్ స్టార్ట్ చేశారు.రామ్ చ‌ర‌ణ్ న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గాను స‌త్తా చాటుతున్నాడు.“ఖైదీ నంబర్ 150”, “సైరా నరసింహా రెడ్డి” వంటి అధిక బడ్జెట్ చిత్రాలతో నిర్మాతగానూ నిలదొక్కుకున్నాడు.

Ram Charan Brand Ambassador For Disney Plus hotstar
Ram Charan Brand Ambassador For Disney Plus hotstar

ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని సమాచారం. మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం రామ్ చరణ్ త్వరలో ఒక న్యూస్ ఛానెల్ కొనుగోలు చేయబోతున్నాడని టాక్.

ఈ ఛానెల్ కొంతకాలంగా నష్టాల్లో ఉందని, సుజనా చౌదరి, టిజి వెంకటేష్ వంటి రాజకీయ నాయకులు కొంతకాలం పాటు ఈ ఛానెల్‌ని అనధికారికంగా పోషించారని పుకార్లు వచ్చాయి. అయితే ఆ తరువాత వారు దానిని వదిలించుకున్నారట.ఇప్పుడు ఆ ఛానెల్‌ని చ‌ర‌ణ్ ద‌క్కించుకోవాల‌ని అనుకున్న‌ట్టు తెలుస్తుంది.

మ‌రోవైపు రామ్ చరణ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసినట్లు తెలుస్తోంది. బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు రామ్ చరణ్ భారీ మొత్తం డిమాండ్ చేయగా, అందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ ఓటిటి సంస్థల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒకటి. ఇందుకు బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్ ను ఎన్నుకోవడం పట్ల రామ్ చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.