Ram Charan: ముంబైలో ఖ‌రీదైన బంగ్లా కొనుగోలు చేసిన రామ్ చ‌ర‌ణ్‌

టాలీవుడ్ హీరోలు ముంబై న‌గ‌రాన్ని ఏలే ప‌నిలో ప‌డ్డారు. ఇప్ప‌టికే చాలా మంది స్టార్స్ ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ హిందీ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుండ‌గా, కొంద‌రు డైరెక్ట్‌గా హిందీలో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ముంబైలో ఖ‌రీదైన బంగ్లాలు కొనుగోలు చేస్తున్నారు. తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ముంబై న‌గ‌రంలో ఖ‌రీదైన బంగ్లాని కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తుంది.

ram charan bungalow
ram charan bungalow

ఇటీవ‌లే త‌న భార్య ఉపాస‌న‌తో క‌లిసి ముంబైలోని ఇంటి గృహ ప్ర‌వేశంచేసాడ‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో అంద‌రిలో అనేక అనుమానాలు త‌లెత్తుతున్నాయి. అస‌లు రామ్ చరణ్ దృష్టి ముంబైపై ఎందుకు పడింది? అక్కడ సపరేట్‌గా బంగ్లా ఎందుకు కొనాల్సి వచ్చింది.. అందుకు ముఖ్యమైన కారణం ఏంటి? అనే దానిపై ఫిలిం నగర్‌లో చర్చలు జోరందుకున్నాయి.

సినీ సెల‌బ్రిటీలు సాధార‌ణంగా ఎక్కువ‌గా ఏదైన ప్రాంతానాకి వెళ్తుంటే అక్క‌డ ఓ బంగ్లాను కొనుగోలు చేస్తుండ‌డం స‌హజం. రామ్ చ‌ర‌ణ్ కూడా తన షూటింగ్స్ నిమిత్తం రెగ్యులర్‌గా ముంబై వెళ్లొస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న తన విడిది కోసం ఏకంగా ఓ బంగ్లానే కొనుగోలు చేశారట. ఇది పెట్టుబడి మార్గమే కాకుండా తనకు చాలా ఉపయోగకరమని రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

ముంబై వెళ్లిన‌ప్పుడ‌ల్లా హోట‌ల్స్ వెత‌క‌డం, అక్క‌డ ఉండేందుకు హోట‌ల్స్‌కు వేలువేలు చెల్లించ‌డం దీని వ‌ల‌న త‌ప్పుంద‌ని ఆలోచించి ముంబైలో ఖ‌రీదైన బంగ్లాని కొనుగోలు చేశార‌ట రామ్ చ‌ర‌ణ్‌. బీచ్ ఫేసింగ్‌తో ఎంతో విలాసవంతంగా ఈ భవనం ఉందని తెలుస్తోంది. ఫ్యామిలీతో సహా వెళ్లి ముంబైలో ఎన్ని రోజులైనా ఉండడానికి వీలుగా సకల సౌకర్యాలు ఈ భవనంలో ఉన్నాయట.

ప్ర‌స్తుతం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ ఇప్ప‌టికే పూర్తైన‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ సినిమా త‌ర్వాత శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చేయ‌నున్నాడు చ‌ర‌ణ్‌. రీసెంట్‌గా చెన్నైకి వెళ్లి శంక‌ర్‌ని కూడా క‌లిసాడు చ‌ర‌ణ్‌. ఇందుకు సంబంధించిన పిక్ వైర‌ల్‌గా మారింది. మ‌రోవైపు చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నారు.