Charan: రామ్ చరణ్, శంకర్ సినిమా కూడా అటకెక్కిన‌ట్టేనా?

Charan: పాపం శంకర్ టైమ్ ఈ మధ్య అస్సలు బాగోలేదు. పర్సనల్‌గా.. ప్రొఫెషనల్ గానూ ఇబ్బందులు పడుతున్నాడు. వ్యక్తిగతంగా తల్లిని పోగొట్టుకున్నాడు శంకర్. ఇక సినిమాల పరంగా చూసుకుంటే ఒక్కటి కూడా అనుకున్నట్లుగా సాగడం లేదు. చేతిలో మూడు సినిమాలు ఉన్నా కూడా ఒక్కటి కూడా అనుకున్న విధంగా ముందుకు వెళ్లడం లేదు. భారతీయుడు 2 సగంలో ఆగిపోయింది.. రామ్ చరణ్ సినిమా ఇప్పటికీ మొదలు కాలేదు.. అపరిచితుడు హిందీ రీమేక్ ఏంటో అర్థం కావడం లేదు.

Ram Charan

ఇన్ని జరిగినా కూడా శంకర్ అంటే హీరోలకు యిష్టమే. ఎందుకంటే శంకర్ కేవలం సౌత్ డైరెక్టర్ మాత్రమే కాదు పాన్ ఇండియన్ దర్శకుడు.. అలాగే ఆయన చేస్తున్న హీరోలు కూడా అలాగే ఉన్నారు. కమల్ హాసన్ గురించి చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ కూడా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియన్ హీరో అయిపోవడం ఖాయం. అలాంటి ఈ ఇద్దరు స్టార్స్ తో సినిమా చేయాలని నిర్మాత అనుకున్నపుడు బడ్జెట్ కూడా కోటలు దాటుతుంది. పైగా కేవలం సౌత్ మాత్రమే కాదు.. పాన్ ఇండియన్ రేంజ్ లో ఇప్పుడు శంకర్, రామ్ చరణ్ సినిమా గురించి చర్చ జరుగుతుంది.

రెండు భిన్న ధృవాలు ఈ సినిమాతో కలిసి పనిచేయబోతున్నాయి అందుకే అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. 30 ఏళ్లుగా తెలుగు సినిమా వైపు చూడని ఈ దర్శకుడు ఇప్పుడు స్ట్రెయిట్ మూవీ చేస్తున్నాడు. దీనికోసం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేస్తున్నాడు శంకర్. ఇప్పటికే చెప్పిన లైన్ కూడా నచ్చడంతో నిర్మాత దిల్ రాజు ఓకే చెప్పేసాడు. ఈ సినిమాలో ఎలాంటి గ్రాఫిక్స్ ఉండవని తెలుస్తుంది. ఎలా ఉన్నా కూడా రామ్ చరణ్ సినిమాను కూడా రెండు మూడేళ్లు చేస్తాడని ఇప్పటికే ఈ సినిమా గురించి అభిమానులు చర్చ మొదలు పెట్టారు. కానీ ఈ సారి మాత్రం అలా ఉండదంటున్నాడు శంకర్.

Ram Charan

తనతో సినిమా అంటే కచ్చితంగా రెండు మూడేళ్లు అవుతుందని అంతా ఫిక్స్ అవుతారు కానీ రామ్ చరణ్ సినిమాను మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేస్తానంటున్నాడు. ఈ సినిమాలో ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ కానీ.. స్పెషల్ సీన్స్ కానీ ఉండవంటున్నాడు ఈ దర్శకుడు. కేవలం కథతోనే ఈ సినిమా ముందుకు వెళ్తుంది కానీ టెక్నికల్ బేస్ మీద కాదంటున్నాడు ఈ దర్శకుడు. రాజకీయ నేపథ్యంలో రామ్ చరణ్ సినిమా ఉండబోతుంది.

ఒకే ఒక్కడు సినిమాకు సీక్వెల్ ఇది అనే ప్రచారం జరుగుతుంది. ఫైనల్ నెరేషన్ అయిపోతే షూటింగ్ కు వెళ్లడమే తరువాయి అంటున్నాడు ఈ సినిమాను 150 కోట్లతో నిర్మించాలని చూస్తున్నాడు దిల్ రాజు. అందులో చెరో 40 కోట్ల పారితోషికం శంకర్, రామ్ చరణ్‌కు ఇస్తున్నాడు దిల్ రాజు. మిగిలిన 70 కోట్లు ప్రొడక్షన్ కాస్ట్ అని తెలుస్తుంది. భారతీయుడు 2 వివాదం తెగితే రామ్ చరణ్ సినిమా మొదలవుతుంది. అప్పటి వరకు ఎదురుచూపులు అయితే తప్పవు.