Ram Charan: త‌మ టేస్ట్‌కు త‌గ్గ‌ట్టు ముంబై ఇంటిని డిజైన్ చేయించుకున్న చెర్రీ దంప‌తులు

Ram Charan: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ముంబైలో ఇల్లు కొనుగోలు చేసిన‌ట్టు కొద్ది రోజులుగా వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ముంబైలోని ఖార్ ప్రాంతంలో విలాసవంతమైన బీచ్ సైడ్ హౌజ్ ను కొనుగోలు చేశారని, ఇంటి గృహ ప్రవేశం కూడా జరిగిపోయింది అంటున్నారు. అయితే చరణ్ ముంబైలో ఇల్లు కొనడానికి ప్రత్యేక కారణం ఉందట.

ఈ మ‌ధ్య కాలంలో సినిమాలకి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రిపేందుకు ఎక్కువ‌గా ముంబై వెళ్లాల్సి వ‌స్తుంద‌ట‌. వెళ్లిన ప్రతిసారీ హోటల్లో గడపాల్సి వస్తోందట. “ఆర్ఆర్ఆర్” సినిమా షూటింగ్ లో కొంతభాగం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా “ఆర్ఆర్ఆర్” పాన్ ఇండియా మూవీ. కాబట్టి ఈ చిత్రం తరువాత చరణ్ బాలీవుడ్ లో కూడా నటించే అవకాశం లేకపోలేదు. ఈ కారణాల దృష్ట్యా ముంబైలో అద్భుతమైన బీచ్ సైడ్ ఇల్లు కొన్నారని అనేక వార్త‌లు వ‌చ్చాయి

అయితే ఇందులో ఎంత క్లారిటీ ఉందో తెలియ‌క అభిమానులు క‌న్ఫ్యూజ‌న్‌లో ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల‌లో చ‌ర‌ణ్ ఇంటికి సంబంధించి కొన్ని ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కొటారి అనే డిజైన‌ర్ రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తుల టేస్ట్‌కి త‌గ్గ‌ట్టు డిజైన్ చేసిన‌ట్టు చెబుతున్నారు. ఫొటోలు చూస్తుంటే మాత్రం చాలా రిచ్‌గానే చెర్రీ త‌న ఇంటిని డిజైన్ చేయిచుకున్న‌ట్టు తెలుస్తుంది. స‌మంత‌- నాగ చైత‌న్య దంప‌తులు కూడా ముంబైలో ఇంటిని కొనుగోలు చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం.

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హిరోయిన్ గా నటిస్తోంది. ఇది కాకుండా మెగాస్టార్ చిరు నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా చరణ్ మరొక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలావుండగా ప్రస్తుతం రెండు బాలీవుడ్ ప్రాజెక్టులలో నటిస్తున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కూడా ముంబైలో ఒక ఇల్లు కొన్న విషయం తెలిసిందే.