Rakul preeth singh : కరోనా విజృంభణకు కారణం చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్..!

Rakul preeth singh : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్ళీ గత రెండు నెలలుగా విజృంభిస్తోంది. వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు లెక్కకు మించి పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలే కాదు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కరోనా బారిన పడుతున్నారు. ఎంత పెద్ద వాళ్ళైనా టైం బాగోలేకపోతే కరోనా నుంచి తప్పించుకోలేపోతున్నారు. గత ఏడాది నుంచి ఆర్ధిక నష్టం, ప్రాణ నష్టం ఊహించని విధంగా జరుగుతోంది. కరోనా వల్ల గత ఏడాది దాదాపు 7-8నెలలు లాక్‌డౌన్ ప్రక్రియ కొనసాగింది. కొంత పరిస్థితులు సద్దుమనిగాక మళ్ళీ యదావిధిగా అన్నీ రంగాలలో పనులు వేగవంతం అయ్యాయి.

rakul-preeth-sing-explains-the-reason-for-rapid-spreading-of-carona
rakul-preeth-sing-explains-the-reason-for-rapid-spreading-of-carona

హమ్మయ్యా పర్లేదు కాస్త మళ్ళీ అన్నీ పరిస్థితులు ఒకదారిలోకి వచ్చాయనుకునేలోపే కరోనా సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడింది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ మరీ విస్తృతంగా వ్యాపిస్తోంది. కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. దీని పై తాజాగా సౌత్ అండ్ నార్త్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో మళ్ళీ అన్ని రంగాలపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మినీ లాక్ డౌన్ తరహా పరిస్థితులు నెలకొన్నాయి.

Rakul preeth singh : రకుల్ ప్రీత్ సింగ్ తల రాత బాగలేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు.

ఇక ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పూర్తిగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అంతేకాదు మన తెలుగు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతోంది. బాలీవుడ్‌లో సినిమా షూటింగ్ లు ఎప్పడో నిలిచిపోయాయి. టాలీవుడ్ లో కూడా దాదాపుగా సినిమా షూటింగులు, రిలీజ్ డేట్‌లు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది లాక్ డౌన్ లో సినిమా షూటింగులు ఆగిపోయినప్పుడు తాను చాలా బాధపడ్డానని తెలిపింది. కానీ.. ఇప్పుడు అంతగా బాధలేదని చెప్పింది రకుల్. ఇక కరోనా ఈ స్థాయిలో విజృంభించడానికి జనాల నిర్లక్ష్యమే కారణమంటున్నారు. ఇందుకు నేను ఒప్పుకోనని చెబుతోంది. తల రాత బాగలేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరని చెప్పుకొచ్చింది. కాగా రకుల్ తెలుగులో క్రిష్వైష్ణవ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమాలో నటించింది. బాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తోంది.

Advertisement