Rakul preet singh : రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఒక్క సినిమా హిట్ అయితే బాలీవుడ్ లోవాళ్ళంతా అవుట్..?

Rakul preet singh : రకుల్ ప్రీత్ సింగ్ చేతి నిండా సినిమాలున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో చాలా బిజీగా ఉంది. అయితే మునుపటి స్టార్ హీరోయిన్ రేంజ్ మేయింటైన్ చేస్తుందా లేదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. టాలీవుడ్ లో నాగార్జున తో మన్మధుడు 2 సినిమా చేసిన తర్వాత టాలీవుడ్ లో క్రేజ్ బాగా తగ్గిపోయింది. అయితే ఇప్పుడు తెలుగులో నితిన్ తో చెక్ సినిమా చేసింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమాలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.

rakul-preet-singh-will-be-settled-in-bollywood-with-this-movie
rakul-preet-singh-will-be-settled-in-bollywood-with-this-movie

తెలుగులో ఈ రెండు సినిమాలలో ఏ ఒక్క సినిమా సూపర్ హిట్ అయినా ఇక టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ కి ఎదురే ఉండదు. ఎటూ మెగా హీరోల సినిమాలలో నటించే అవకాశాలు గ్యారెంటీగా దక్కుతాయని అంటున్నారు. చెప్పాలంటే చెక్ సినిమా మీద భారీగా నమ్మకాలు పెట్టుకున్నారు. క్రిష్ సినిమాకి అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. కాగా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రకుల్ ప్రీత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిటయింది. ఇంతక ముందు అజయ్ దేవగన్, టబు లతో కలిసి దేదే ప్యార్ దే అన్న సినిమా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికి రకుల్ సోలో హీరోయిన్ గా పెద్దగా క్రేజ్ దక్కలేదు.

Rakul preet singh : రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో చేస్తున్న సినిమాలలో ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయినా సెటిలయినట్టే..!

దాంతో ఇప్పుడు మరోసారి అజయ్ దేవగన్ తో మేడే అన్న సినిమా చేస్తోంది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు బాలీవుడ్ లో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో చేస్తున్న సినిమాలలో ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయినా ఇక బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ సెటిలయినట్టే అని చెప్పుకుంటున్నారు. కాగా రకుల్ – జాన్ అబ్రహం నటించిన అటాక్ అన్న సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా మీద ఎన్నో హోప్స్ ఉన్నాయి. మరి ఈ సినిమాతో బాలీవుడ్ లో లక్ కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక తమిళ సినిమాలలో కూడా నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఆగిపోయిన ఇండియన్ 2 గనక పట్టాలెక్కితే భారీ ప్రాజెక్ట్ రకుల్ చేతిలో ఉన్నట్టే.

Advertisement