Rakul Preet Singh: ఈ వీడియోతో రకుల్ ప్రీత్ సింగ్ పరువు తీసిన తమ్ముడు

Rakul Preet Singh: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోహీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ అభిమానుల ప్రశంసలు పొందాలని చూస్తుంటారు. అయితే ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఆ పని ఇంకాస్త ఈజీ అయ్యింది. తమ సినిమా యాక్టివిటీస్ తో పాటు పర్సనల్ అండ్ టాలెంటెడ్ స్కిల్స్ ను కూడా తమ అభిమానులతో పంచుకుంటున్నారు.

Rakul Preet Singh Video Share by his Brother
Rakul Preet Singh Video Share by his Brother

అలా రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే హీరోయిన్. తన తమ్ముడు అమన్ ప్రీత్ తో కలిసి ఎంటర్ టైన్ చేసే వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. లాస్ట్ ఇయర్ లాక్ డౌన్ లో వీరిద్దరూ కలిసి ఎంత సరదాగా ఆడుకున్న ఆటలు హల్ చల్ చేసాయి.

తమ పేరేంట్స్ తో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు ఇంకా మాల్దీవుల్లో ఎంటర్ టైన్ చేసిన వీడియోలు అందర్నీ ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా రకుల్ వంటపై ప్రయోగం చేయాలని ఉద్దేశ్యంతో వంటగదిలోకి వెళ్ళారు. వంట అనేది ఓ ఆర్ట్. ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే అద్భుతంగా ఉంటుంది.

రకుల్ కి వంట మీద అవగాహన లేనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలో రకుల్ ప్రీత్ సింగ్ ఓ వంటకాన్ని తయారు చేశారు. దీంతో వంట గదిలో తన స్వీట్ సిస్టర్ చేసిన వంటను అమన్ ప్రీత్ వీడియో తీసారు. ఈ వీడియోలో అక్కా ఏం చేస్తున్నావని అమన్ అడిగితే ఆ వంట పూర్తిగా మాడిపోవడం దాన్ని కవర్ చేసే ప్రయత్నంలో అది ప్యాన్ కేక్ అని చెప్పడంతో అలా రకుల్ చేసిన వంట తినకపోవడమే బెటర్ అని కామెంట్ చేశారు.

అలా రకుల్ చేసిన ఫన్నీ వీడియోని పోస్ట్ చేశారు. రకుల్ ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలతో బిజీగా ఉంది. తెలుగుతో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సినిమాల్లో నటిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోహీరోయిన్లంతా తమకు వచ్చిన వంటల్ని వీడియో తీసి మరీ తమ అభిమానులతో పంచుకుంటున్నారు.