Rakul Preet Singh: మెరిసిపోతున్న ర‌కుల్ ప్రీత్ సింగ్.. స్ట‌న్ అవుతున్న ఫ్యాన్స్

Rakul Preet Singh: ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ర‌కుల్ ప్రీత్ సింగ్‌కి ఇక్క‌డ అవ‌కాశాలే కరువ‌య్యాయి. దీంతో చేసేదేం లేక చిన్న హీరోల‌తోను న‌టించేందుకు సిద్ధ‌మైంది. ఇటీవ‌ల వైష్ణ‌వ్ తేజ్‌తో క‌లిసి కొండ పొలం అనే సినిమా చేసింది. ఈ సినిమాలో వైష్ణవ్ తో పాటుగా రకుల్ నటనకు చిరంజీవి సైతం ప్రశంసలు కురిపించారు.

Rakul Preet Singh Revealed about Her Love
Rakul Preet Singh Revealed about Her Love

ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్‌గా త‌న సోష‌ల్ మీడియా ద్వారా ముఖ్యమైన ప్రకటన చేసింది. అధికారికంగా తన వివాహం గురించి వెల్లడించింది .తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటన చేసింది. శనివారం జన్మదినం జరుపుకున్న రకుల్ ప్రీత్ సింగ్ అదే రోజున తనకు మూవీ ఇండస్ట్రీలో ముఖ్యమైన స్నేహితులతో తొలుత ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. బాలీవుడ్ నిర్మాత..నటుడు అయిన జాకీ భగ్నానీతో తన వివాహం జరగనుంది రకుల్ వెల్లడించారు.

Rakul Preet Singh Revealed about Her Love
Rakul Preet Singh Revealed about Her Love

తన పెళ్లి గురించి చెబుతూ రకుల్ జీవితంలో తనకు సంతోషాన్ని పంచే సందర్భంగా పేర్కొన్నారు. ఈ ఏడాది తన జీవితంలో ఇదే గొప్ప గిఫ్ఠ్ గా అభివర్ణించారు. తన జీవితంలో కొత్త రంగులు తీసుకొస్తుందని ఆకాంక్షించారు. అయితే సోష‌ల్ మీడియాలో అంద‌మైన ఫొటోలు షేర్ చేస్తూ కేక పెట్టించే ర‌కుల్ ప్రీత్ సింగ్ తాజాగా స్టైలిష్ డ్రెస్‌లో స్ట‌న్నింగ్ లుక్‌లో క‌నిపించి మెరిసిపోయింది. అప్పుడే పెళ్లి క‌ళ‌వ‌చ్చేసిన‌ట్టుందే అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.