Rakul Preet Singh : రకుల్ అందాల ‘ఆదమరుపు’.! మరీ ఇంతలా కవ్విస్తే ఎలాగమ్మా.!
NQ Staff - January 5, 2023 / 02:41 PM IST

Rakul Preet Singh : ముంబయ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్‌కి టాలీవుడ్‌లో మంచి పేరుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఛైర్‌ని సక్సెస్‌ఫుల్‌గా ఏలిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.
రామ్ చరణ్, ఎన్టీయార్, అల్లు అర్జున్.. ఇలా టాలీవుడ్ యంగ్ స్టార్స్ అందరితోనూ స్ర్కీన్ షేర్ చేసుకుంది. తర్వాత బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంది. అక్కడా రకుల్‌కి తిరుగు లేదిప్పుడు.
వరుస సినిమాలతో రకుల్ బాలీవుడ్ కెరీర్ జెట్ స్పీడులో దూసుకెళ్లిపోతోంది. నెలల గ్యాప్‌లోనే రకుల్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజవుతున్నాయ్.
జోష్ విత్ గ్లామర్ డోస్.!
రీసెంట్‌గా ‘డాక్టర్ జి’ సినిమాలో నటించింది రకుల్ ప్రీత్ సింగ్. అలాగే, మరిన్ని హిందీ ప్రాజెక్టులతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తోంది. బాలీవుడ్‌లో బిజీ అయిపోవడంతో టాలీవుడ్‌లో పెద్దగా సినిమాలు చేయడం లేదు.
ఇదిలా వుంటే, త్వరలో రకుల్ పెళ్లి చేసుకోబోతోందంటూ ఈ మధ్య గట్టిగా ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే, తన బాయ్ ఫ్రెండ్ మరియు బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీతో రకుల్ వివాహం త్వరలోనే జరగనుంది. ఓ పక్క పెళ్లి హుషారో, మరోపక్క సినిమాల జోరో తెలీదు కానీ, సోషల్ మీడియాలో రకుల్ ఫుల్ జోష్‌తో వున్న ఫోటోలు సందడి చేస్తున్నాయ్.
జోష్‌తో పాటూ, గ్లామర్ డోస్ కూడా ఒకింత ఎక్కువగానే వుంది రకుల్ ఈ పోజుల్లో. ఆదమరిచి మరీ అందాలారేస్తూ హార్ట్‌ఫుల్ స్మైల్‌తో పిచ్చెక్కిస్తోంది అందాల రకుల్ ప్రీత్.