Rakul Preet Singh: పూల్ దగ్గ‌ర బికినీలో ర‌కుల్‌.. పెళ్ళి కుదిరిన ఏం త‌గ్గ‌ట్లేదుగా..!

Rakul Preet Singh: టాలీవుడ్ ప్రేక్షుకులని ఎంత‌గానో అల‌రించిన ముద్దుగుమ్మ‌ల‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. 2014 లో దివ్య ఖోస్లా కుమార్ యారియాన్ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆమె సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన నీరజ్ పాండే అయ్యారీ యావరేజ్ గా ఆడింది. దే దే ప్యార్ దే లో కూడా నటించింది. సిద్ధార్థ్ మల్హోత్రా- తారా సుతారియాతో పాటు మార్జావాన్ లో భాగమైంది.

Rakul Preet Singh Latest Bikni Pics
Rakul Preet Singh Latest Bikni Pics

బాలీవుడ్ తో పాటు కన్నడ- తెలుగు- తమిళ చిత్రాలలో కూడా నటించింది ర‌కుల్‌. చివరిగా నెట్ ఫ్లిక్స్ సర్దార్ కా గ్రాండ్ సన్ లో కనిపించింది. ఈ చిత్రంలో అర్జున్ కపూర్ – నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్ దేవగన్ దర్శకత్వం వహించి నిర్మించనున్న థ్రిల్లర్-డ్రామాలో పైలట్ పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటిస్తున్న డాక్టర్ జి చిత్రంలో కూడా ఆమె నటించనుంది.

రీసెంట్‌గా ర‌కుల్ త‌న 31వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఆ రోజే పెళ్లి వేడుకలకు సంబంధించిన ప్రణాళికలు చెప్పుకొచ్చింది. బాలీవుడ్ నిర్మాత తనయుడు.. హీరో జాకీ భగ్నానితో పెళ్లికి సిద్ధంగా ఉన్న‌ట్టు తెలియ‌జేసింది రకుల్. త్వ‌ర‌లో పెళ్లి చేసుకోనున్న ర‌కుల్ బుధవారం ఉదయం తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పూల్ సైడ్ ట్రీట్ ని షేర్ చేసింది.

ఈ వీడియోలలో రకుల్ కొలను దగ్గర పోజు ఇస్తూ కనిపించింది. ఈ పోస్ట్ కు ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. `నన్ను తిరిగి మాస్క్ అవసరం లేని సెలవుదినానికి తీసుకెళ్లండి“ అంటూ వ్యాఖ్యను జోడించి #మూడ్ #వాటర్ బేబీ అనే హ్యాష్ ట్యాగ్ లను జోడించింది. ర‌కుల్ పిక్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.