Rakul preet singh: ర‌కుల్ పెళ్లిపై పుకార్లు… సీరియ‌స్ అయిన ముద్దుగుమ్మ‌

Rakul preet singh: ఒక‌ప్పుడు తెలుగులో తెగ హ‌ల్ చ‌ల్ చేసిన అందాల ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మ‌డు తెలుగులో చివ‌రిగా కొండ పొలం అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. ఇక ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో చాలా బిజీగా ఉంది.పుష్క‌ర కాలంగా హీరోయిన్‌గా తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో మ‌హేశ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ వంటి అగ్ర హీరోలంద‌రితో దాదాపు న‌టించారు.

rakul preet singh gets enagedjpg
rakul preet singh gets enagedjpg

అలాగే ఆమె ఓవైపు సినిమాలు, మ‌రో వైపు ఫిట్‌నెస్ రంగంలో రాణిస్తూ బిజీగా కూడా ఉంది. ఎఫ్ 45 అనే జిమ్ సెంట‌ర్‌ను కూడా ర‌కుల్ నిర్వ‌హిస్తోంది. అలాగే వీలునప్పుడల్లా సోష‌ల్ మీడియాలోనూ త‌న ఫిట్‌నెస్ ర‌హ‌స్యాలు, యోగ గురించి చెబుతూ యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా ఆమె వైష్ణ‌వ్ తేజ్‌తో న‌టించిన కొండ‌పొలం చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

ర‌కుల్ పెళ్లికి సంబంధించి ప‌లు వార్తలు వ‌స్తున్న క్ర‌మంలో ఆమె సీరియ‌స్ అయింది. సీక్రెట్‌గా ర‌కుల్ పెళ్లి చేసుకుంటుంద‌ని ప్ర‌చారాలు చేస్తున్న క్ర‌మంలో ర‌కుల్ స్పందించింది. ‘‘నా జీవితానికి సంబంధించిన ఏ ముఖ్యమైన విషయం అయినా నేనే అందరితో పంచుకుంటాను. అంతే కానీ అనవసరంగా అసత్యాలను ప్రచారం చేయకండి’’ అంటున్నారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌.

‘నా చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం నా దృష్టి అంతా వాటిపైనే ఉంది. అందుకే నా గురించి వచ్చే వదంతులను పట్టించుకునే తీరిక నాకు లేదు. ఇక నా జీవితం పట్ల నేనెంతో పారదర్శకంగా ఉంటాను. నాకు సంబంధించిన ఏ విషయం అయినా ఫస్ట్‌ నేనే చెబుతాను’’ అని పేర్కొన్నారు.

rakul preet singh gets enagedjpg
rakul preet singh gets enagedjpg

ఇక భగ్నానీలో తనకు నచ్చిన అంశాల గురించి రకుల్‌ మాట్లాడుతూ– ‘‘మా ఇద్దరి ఆలోచనాధోరణి ఒకేలా ఉంటుంది. సన్నిహితులకు, స్నేహితులకు మేం ఇచ్చే ప్రాధాన్యత కూడా ఒకేలా ఉంటుంది. అలాగే ఇద్దరం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఉదయాన్నే వర్కౌట్‌ చేయడం వంటి వాటిని కచ్చితంగా ఫాలో అవుతాం. మా ఇద్దరికీ మధ్య ఇన్ని కనెక్టింగ్‌ అంశాలు ఉన్నాయి కాబట్టే మేం కనెక్ట్‌ అయ్యామని అనుకుంటున్నాం’’ అన్నారు.