ఓరకంటితో కాల్చేస్తోంది.. రకుల్ హాట్ లుక్స్‌కు నెటిజన్లు ఫిదా
NQ Staff - December 4, 2020 / 04:14 PM IST
రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో మంట పెట్టడంలో ముందుంటుంది. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను ఊపేస్తుంటుంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న రకుల్ ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. మల్లెతీగలా మారేందుకు 24 గంటలు జిమ్‌లోనే గడిపినట్టుంది. ఆ మధ్య వర్కవుట్లతో రకుల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. యోగాలు, ఆసనాలు అంటూ రకుల్ పూర్తిగా బక్క చిక్కిపోయింది.
రకుల్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే వస్తోంది. లాక్డౌన్లో ఫ్యామిలీతో కలిసి ఆడిన ఆటలు ఎంతగా వైరల్ అయ్యాయి. ఆ తరువాత డ్రగ్స్ కేసులో రకుల్ పేరు బయటకు రావడం, మళ్లీ అవి పుకార్లేనని రావడం, ఆ తరువాత మళ్లీ రకుల్ పేరు తెరమీదకు రావడం ఇలా రకుల్ పేరు మొత్తం రచ్చ రచ్చగా మారింది. చివరకు రకుల్‌కు ఆ డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది.
ఇక రకుల్ మాల్దీవుల్లో చేసిన బికినీ షో గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తల్లిదండ్రుల 31వ వివాహా వార్షికోత్సవాన్ని సెలెబ్రేట్ చేసేందుకు మాల్దీవులకు వెకేషన్స్‌కు వెళ్లింది. అలా అక్కడ రకుల్ అందాలను విచ్చల విడిగా ఆరబోసింది. మళ్లీ ఇప్పుడు తన కంటి చూపుతోనే నెటిజన్లను కాల్చేసేలా.. ఓరకంటితో చూస్తోంది. రకుల్ జీర్ సైజ్ నడుము, పొట్టి బట్టలు ఇలా అన్ని కూడా వైరల్ అవుతున్నాయి.