Rakul Preet: త‌న న‌ట‌న‌తో ర‌కుల్ ఫ్యామిలీ మొత్తాన్ని ఇంప్రెస్ చేసిన స‌మంత‌

Rakul Preet: సమంత అక్కినేనికి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా వరుస అవకాశాలతో బిజీగా ఉంది సమంత. ఈమధ్య సినిమాల కంటే కూడా డిజిటల్ మీడియాపై ఎక్కువగా ఫోకస్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఈమె నటించిన తొలి వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 ఈ మధ్య విడుదలైంది. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Rakul Preet Family Likes Samantha Performance in Family Man2
Rakul Preet Family Likes Samantha Performance in Family Man2

తెలుగు దర్శక ద్వయం రాజ్ డి.కె సంయుక్తంగా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ కు భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమాలకు ఏ మాత్రం తక్కువ కాని రేంజ్ లో.. ఇంకా చెప్పాలంటే సినిమాల కంటే ఎక్కువగా రెస్పాన్స్ తెచ్చుకుంటుంది ఈ వెబ్ సిరీస్.

సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం ఈ వెబ్ సిరీస్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2 చూశాను. అందరూ అద్భుతంగా నటించారు. మనోజ్‌ బాజ్‌పాయ్ పవర్ ప్యాక్డ్ ప‌ర్‌ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవడం లేదు. ఇక సమంత.. నీ యాక్టింగ్‌కు హ్యాట్సాఫ్‌. రాజీ పాత్రలో జీవించేశావు.

ఈ సిరీస్‌ చూశాక నాతో సహా మా కుటుంబం అంతా నీకు అభిమానులుగా మారిపోయారు. మీ టీమ్‌కు శుభాభినందనలు’ అని రకుల్ త‌న ట్వీట్‌లో పేర్కొంది. ఇందులో శ్రీలంకన్ రెబల్ గా నటించింది సమంత. ఈమె నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ నటిగా సమంత మరో మెట్టు ఎక్కేసింది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు మాత్రమే కాకుండా బోల్డ్ సీన్స్ కూడా బాగానే చేసింది సమంత.

ఈ వెబ్ సిరీస్ కోసం స‌మంత ఏకంగా 4 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ మాన్ 2 రెమ్యూనరేషన్ లిస్టులో రెండో అత్యధిక పారితోషికం అందుకుంది సమంత. ఈమె కంటే ముందు మనోజ్ బాజ్ పేయి ఉన్నాడు. లీడ్ రోల్ చేసిన ఈయన 10 కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

ప్రియమణికి 80 లక్షలు.. మనోజ్ కూతురుగా నటించిన ఆశ్లేష ఠాకూర్ 50 లక్షలు.. శరత్ కేల్కర్ కోటిన్నర.. జెకె తల్పడేగా నటించిన శరీబ్ హస్మి 65 లక్షలు.. మేజర్ సమీర్ పాత్రలో అలరించిన దర్శన్ కుమార్ కోటి రూపాయల పారితోషికం అందుకున్నారు