samantha: స‌మంత‌, ర‌కుల్‌ని ఇంప్రెస్ చేసిన పిట్ట‌క‌థ‌లు.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆనందం వ్య‌క్తం చేసిన ముద్దుగుమ్మ‌లు

samantha ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ అంతా డిజిటల్ ప్రపంచం వైపే పరుగులు తీస్తుంది. చిన్న సినిమాల హీరోల దగ్గర్నుండి, పెద్ద హీరోల దగ్గర వరకు అందరూ తమ టాలెంట్ ను ప్రజంట్ చేయడానికే చూస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ రంగంలో చిన్నా, పెద్ద స్టార్స్ అనే సంబంధం లేకుండా నటిస్తున్నారు. నిజానికి డిజిటల్ రంగంలో ఎంతో మంది నటీనటులు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఈ క్రేజ్ మరింత పెరిగింది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనైనా స్టార్స్ అంతా డిజిటల్ ఓటీటీలోకి పరుగులు తీసినవారే.

లేటెస్ట్ గా కొంతమంది మహిళల రియల్ లైఫ్ నేఫథ్యంలో తెరకెక్కిన సినిమా పిట్ట కథలు. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఓ అంథాలజీ సిరీస్ ని తెరకెక్కించారు. ఈ సిరీస్ లో నాలుగు డిఫరెంట్ స్టోరీలను నలుగురు దర్శకులు రూపోందించారు. నాగ్ అశ్విన్, నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డిలు కలిసి నాలుగు పార్ట్స్ గా చిత్రీకరించారు. ఈ అంథాలజీలో శృతిహాసన్, అమలాపాల్, ఈషా రెబ్బా, మంచు లక్ష్మీ తదితరులు నటించారు.

ఈ అంథాలజీ ఫిబ్రవరి 19వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సిరీస్ పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లు ప్రశంసలు వెలువెత్తారు. పిట్టకథలు అనే అంథాలజీ అందరూ తప్పక చూడాల్సిన సిరీస్ అంటూ పొగిడారు. తమ సోషల్ మీడియా వేదికగా తమ భావాలను వ్యక్తపరిచారు. ఈ సిరీస్ లో ముఖ్యంగా మీరా అనే పార్ట్ ని డైరెక్ట్ చేసిన నందిని రెడ్డిపై సమంత ప్రశసించారు. అలాగే అందులో నటించిన అమలాపాల్, జగపతిబాబును కూడా పొగిడారు. రాముల అనే మరో పార్ట్ లో యాక్ట్ చేసిన మంచు లక్ష్మీ పాత్రకు తాను ఫిదా అయ్యానని అన్నారు సమంతా. ఈమెతో పాటు మంచు లక్ష్మీ కారెక్టర్ కు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ప్రశంసలు కురిపించారు.

Advertisement