Rakshitha Reddy : శర్వానంద్ భార్య బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదు.. ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..?

NQ Staff - June 10, 2023 / 01:07 PM IST

Rakshitha Reddy : శర్వానంద్ భార్య బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదు.. ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..?

Rakshitha Reddy : యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. జైపూర్ లో ఉన్న లీలా ప్యాలెస్ లో వీరిద్దరి పెండ్లి ఘనంగా జరిగింది. రక్షిత రెడ్డితో ఆయన గత జనవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. అప్పటి నుంచి కాస్త గ్యాప్ తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. దీంతో అసలు ఈ రక్షిత రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటా అని అంతా ఆరా తీస్తున్నారు.

రక్షిత రెడ్డి తెలుగు అమ్మాయే. ఆమె తండ్రి మధుసూదన్ రెడ్డి హైకోర్టులో లాయర్ గా పని చేస్తున్నాడు. తల్లి సుధా రెడ్డి. ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఆమె మనవరాలు అవుతుంది. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోంది రక్షిత రెడ్డి. అయితే ఆమెకు ఆస్తులు కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తోంది.

వీరిది పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. ఆమెకు బెంగుళూరు, హైదరాబాద్ లో ఖరీదైన భూములు ఉన్నాయి. వాటి విలువ వందల కోట్లలో ఉంటుందని సమాచారం. మధుసూదన్ రడ్డి పేరుమోసిన లాయర్. ఇక రక్షిత రెడ్డి కూడా టైమ్ పాస్ కోసమే సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోంది.

పెళ్లి తర్వాత ఆమె జాబ్ మానేయనుంది. పెండ్లి కానుకగా శర్వానంద్ కు భారీగా కట్న కానుకలు ఇచ్చినట్టు తెలుస్తోంది. పైగా పెండ్లి ఖర్చు పూర్తిగా రక్షిత రెడ్డి ఫ్యామిలీనే పెట్టుకుందంట. ఇక నిన్న గ్రాండ్ గా హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us