Rakshita: ఇడియ‌ట్‌ హీరోయిన్ ఇప్పుడు గుర్తు ప‌ట్టలేనంత‌గా మారింది..!

Rakshita: సినిమాల‌లో ఉన్నంత వ‌ర‌కు హీరోయిన్స్ త‌మ ఫిజిక్‌తో పాటు గ్లామ‌ర్‌ని త‌ప్ప‌క పాటిస్తారు. దీని కోసం చాలా క‌స‌ర‌త్తులు చేస్తుంటారు. పెళ్లిళ్లు చేసుకొని ఎప్పుడైతే సినిమాల‌కు గుడ్ బై చెబుతారో ఆ త‌ర్వాత వారిని గుర్తు ప‌ట్ట‌డం చాలా క‌ష్టం. గ‌తంలో చాలా మంది హీరోయిన్స్ విష‌యంలో ఇలానే జ‌రిగింది. ఇక ఇప్పుడు ఇడియ‌ట్‌ హీరోయిన్ ర‌క్షిత‌ అయితే అస్స‌లు గుర్తు ప‌ట్ట‌కుండా మారింది. ఇప్పుడు ర‌క్షిత‌ని చూస్తే అంత ఈజీగా ఎవ‌రు గుర్తుప‌ట్ట‌క‌పోవ‌చ్చు.

ఇడియ‌ట్ సినిమాలో ర‌క్షిత పాత్ర సూప‌ర్భ్‌గా ఉంటుంది. హీరోని త‌న‌వైపుకు తిప్పించుకునేలా ద‌ర్శ‌కుడు ప్లాన్ చేయ‌గా,ఆ పాత్ర‌తో ర‌క్షిత‌కి మంచి పేరు వ‌చ్చింది. ఈ సినిమా త‌ర్వాత ర‌క్షిత .. మహేశ్‌బాబు, నాగార్జున వంటి బడా హీరోలతో కూడా న‌టించింది. తెలుగుతో పాటు క‌న్న‌డ సినిమాల‌ను స‌మంగా బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేసిన ర‌క్షిత గురించి మీకు ఎంత వ‌ర‌కు తెలుసు.

ర‌క్షిత అల‌సు పేరు శ్వేత కాగా, ఈమె పుట్టింది బెంగ‌ళూరులో. తండ్రి బీసీ గౌరీశంకర్‌ కొరియోగ్రాఫర్‌, తల్లి మమతా రావు కన్నడ నటి. రక్షిత త‌ల్లిదండ్రులు ఇండ‌స్ట్రీలో ఉండ‌డంతో ఆమెకు సినిమాల‌లో న‌టించే ఆఫ‌ర్ సులువుగా ద‌క్కింది. డిగ్రీ స‌మ‌యంలోనే రక్షిత‌కు ఆఫ‌ర్ వ‌చ్చింది. క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌తో న‌టించిన ర‌క్షిత ఆ త‌ర్వాత వ‌ర‌స పెట్టి సినిమాలు చేసింది.

కన్నడలో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతూనే తెలుగులోనూ నాగార్జునతో శివమణి, మహేశ్‌బాబుతో నిజం, జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఆంధ్రావాలా, జగపతిబాబుతో జగపతి సినిమాల్లో జోడీ కట్టింది. దీంతో ఇక్కడ కూడా స్టార్‌ హీరోయిన్‌గా నిలదొక్కుకుంది. కెరీర్ మంచిగా దూసుకుపోతుంది అనుకున్న స‌మ‌యంలో క‌న్న‌డ డైరెక్ట‌ర్ ప్రేమ్‌ని వివాహం చేసుకుంది.

ప్రేమ్‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు పూర్తిగా దూర‌మైన ర‌క్షిత .. జోగయ్య, డీకే అనే రెండు చిత్రాలను నిర్మించింది. ఆ స‌మ‌యంలో ర‌క్షితని చూసి అంద‌రు షాక్ అయ్యారు. ఈమె ఏంటి ఇలా త‌యారైంద‌ని ముచ్చ‌టించుకున్నారు. అయితే కొడుకు పుట్టాక థైరాయిడ్ స‌మ‌స్య రావ‌డంతో తాను లావెక్కిన‌ట్టు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది ర‌క్షిత‌.

ప్ర‌స్తుతం ర‌క్షిత క‌న్నడ షోస్‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తూ ఏక్ ల‌వ్ యూ అనే సినిమా నిర్మిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో గెస్ట్ పాత్ర పోషిస్తుంద‌ట‌. ద‌శాబ్ధ కాలం త‌ర్వాత ర‌క్షిత వెండితెర‌పై మెర‌వ‌నుండ‌డంతో ఫ్యాన్స్ ఆమె పాత్ర కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు ర‌క్షిత రాజ‌కీయాల‌లోను చురుకుగా ఉంటుంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతోంది.