CARONA :పీపీఈ కిట్‌లో కూర‌గాయ‌లు కొనడానికి వ‌చ్చిన హీరోయిన్..ఫోటోలు వైర‌ల్

ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తుంది. ఉత్తరాది రాష్ట్రాలు అయితే క‌రోనా పేరు వింటే గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు.ఒక‌వైపు భారీ సంఖ్య‌లో కేసులు రావ‌డం, మ‌రో వైపు వేల కొలది మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం అంద‌రిని క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది. ఇక సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖులు కూడా క‌రోనా బారిన ప‌డుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. అయితే క‌రోనా బారిన ప‌డకుండా ఉండేందుకు ఒక్కొక్క‌రు ఒక్కో జాగ్ర‌త్త తీసుకుంటూ అభిమానుల‌ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. అయితే వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే రాఖీ సావంత్ ఈ సారి అంద‌రిచే ప్ర‌శంస‌లు పొందుతుంది.

రాశీ సావంత్ తాజాగా త‌న స‌మీప మార్కెట్ లో కూర‌గాయ‌లు కొనేందుకు వెళ్లింది. అయితే సెల‌బ్రిటీ క‌నిపిస్తే జ‌నాలు గుమికూడ‌డం కామ‌న్. వీటితో పాటు క‌రోనాను దృష్టిలో ఉంచుకొని త‌న శ‌రీరం మొత్తాన్ని పీపీఈ కిట్‌తో క‌ప్పేసి మార్కెట్‌కు వెళ్లింది. దీనిని చూసి ఇదేమి చోద్యం అని అంతా అనుకున్నారు, కాని ర‌క్ష‌ణ కోసం ఇలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవ‌డంలో ఏ మాత్రం త‌ప్పు లేదు అని కొంద‌రు వాపోతున్నారు. రాశీ సావంత్ చేసిన స‌రికొత్త ఆలోచ‌న‌పై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అయితే ‘ త‌క్కువ మొత్తంలో ఎక్కువ కూర‌గాయ‌లు రావ‌డాన్ని చూసి రాఖీ సావంత్ తెగ సంతోషించింది . నా జీవితంలో ఇన్ని ఎక్కువ ఐట్సెం ఇంత తక్కువ ధరకు ఎప్పుడు కొనలేదు’’ అంటూ ఆనందించింది.

Advertisement