Rakesh master : రాకేష్ మాస్టర్ మళ్ళీ రెచ్చిపోయి .. టాప్ స్టార్ డైరెక్టర్ ని బండబూతులు తిట్టాడు !

Rakesh master : రాకేష్ మాస్టర్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితుడు. ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్ గా పాపులారిటీని సంపాదిచుకున్న శేఖర్ మాస్టర్.. జానీ మాస్టర్ లాంటి వాళ్ళు ఈయన దగ్గర్నుంచి వచ్చి పేరు తెచ్చుకున్నవాళ్ళే. అయితే కొత్త నీరు వస్తుంటే పాత నీరు వెళ్ళిపోతుందన్నట్టుగా యంగ్ కొరియోగ్రాఫర్స్ రావడం తో రాకేష్ మాస్టర్ ఫేడవుట్ అయ్యాడు. అయితే ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీ వాళ్ళ మీద తెగ కామెంట్స్ చేస్తూ అభిమానులతో తిట్లు తింటున్నాడు.

rakesh-master-insulted-top-star-director
rakesh-master-insulted-top-star-director

ఆయన మాట్లాడే వాటిలో వాస్తవం ఉన్నా కూడా ఇది ఆయన విమర్శించేవాళ్ళ అభిమానులను మాత్రం నచ్చడం లేదు. చిరంజీవి నుంచి చిన్న హీరో వరకు చాలామంది విషయలో రాకేష్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేసి అందరిలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. కాగా ఈ మధ్య కాస్త సైలెంట్ అయిన రాకేష్ మాస్టర్ మళ్ళీ మొదలు పెట్టాడు. ఈ సారి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మీద పడ్దాడు. ఎప్పటి నుంచో దర్శకుడు కృష్ణ వంశీకి రాకేష్ మాస్టర్ కి మధ్య విబేధాలున్న మాట వాస్తవం.

Rakesh master :  అందరూ అతని చెప్పు చేతల్లో ఉండాలి ..?

ఆ విషయాన్ని మరోసారి బయట పెట్టాడు. చక్రం సినిమాలో ఉన్న జగమంత కుటుంబం నాది పాట కోసం రాకేష్ మాస్టర్ 11 రోజులు పనిచేశాడట. అయితే ఆ పాట చేసినందుకు డబ్బులివ్వలేదంటూ వెల్లడించాడు. అంతేకాదు కృష్ణవంశీ కి ఇగో ఎక్కువని అతను అనుకున్నదే చేస్తాడు తప్ప అవతలి వాళ్ళు చెప్పేది వినడంటూ తెలిపాడు. అందరూ అతని చెప్పు చేతల్లో ఉండాలని లేదంటే సహించడని చెప్పుకొచ్చాడు. ఎప్పుడో అయిపోయిన విషయంలో మళ్ళీ ఇప్పుడెందుకు రాకేష్ మాస్టర్ కి రగిలిందో తెలియాల్సి ఉంది. ఇక కృష్ణవంశీ ప్రస్తుతం రంగ మార్తాండ అన్న సినిమా చేస్తున్నాడు.

Advertisement