Sandalwood: ప‌వ‌ర్ స్టార్ ఫ్యామిలీ నుండి ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న అందాల భామ‌..!

Samsthi 2210 - July 28, 2021 / 03:05 PM IST

Sandalwood: ప‌వ‌ర్ స్టార్ ఫ్యామిలీ నుండి ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న అందాల భామ‌..!

Sandalwood: ఇండ‌స్ట్రీలో వార‌సుల హ‌వా కొనసాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో కొత్త త‌రం హీరోలు, హీరోయిన్స్ వెండితెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. కొంద‌రు త‌మ న‌ట‌న‌తో అల‌రిస్తూ మంచి పేరు తెచ్చుకుంటుండ‌గా, మ‌రి కొంద‌రు మ‌ధ్య‌లోనే డ్రాప్ అవుతున్నారు. ఇప్పుడు లెజండరీ న‌టుడు రాజ్‌కుమార్ ఫ్యామిలీ నుండి మ‌రో వార‌సురాలు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు స‌న్నాహాలు చేసుకుంటుంది.

Sandalwood

రాజ్ కుమార్ ఫ్యామిలీ కన్నడ పరిశ్రమని ఏలుతున్న విష‌యం తెలిసిందే. ఆయన కుమారులు శివ‌రాజ్ కుమార్, పునీత్ రాజ్‌కుమార్ క‌న్న‌డ నాట అగ్ర‌హీరోలుగా ఉన్నారు. ప్ర‌స్తుతం పునీత్ రాజ్ కుమార్ ప‌వ‌ర్ స్టార్‌గా అక్క‌డ అద‌ర‌గొడ‌తున్నాడు. క‌న్న‌డ నాట అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న బ‌డా హీరో పునీత్ కాగా, ఇప్పుడు ఆయ‌న ఫ్యామిలీ నుండి న‌ట వారసురాలు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తుంది.

రాజ్ కుమార్ మనవరాలు ధన్య రామ్ కుమార్ కన్నడ పరిశ్రమలో అదృష్ణాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమతున్నారు. మరికొన్ని రోజుల్లో ధన్య రామ్ కుమార్ సినిమా లాంచింగ్ కి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు ఎవ‌రు, హీరోగా ఎవ‌రు న‌టిస్తారు, నిర్మాతలు ఎవరు? అన్న వివరాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి.

Sandalwood

క‌న్న‌డ ప‌రిశ్ర‌మలో ఇప్పుడు ధ‌న్య‌రామ్ కుమార్ ఎంట్రీకి సంబంధించి జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. అయితే ధ‌న్య‌రామ్ ఎంట్రీ గ్రాండ్‌గా ఉంటుంద‌ని, ఇండ‌స్ట్రీకి సంబంధించి ప‌లువురు ప్ర‌ముఖులు కూడా హాజ‌రు అవుతారు. ధ‌న్య‌రామ్‌కి మంచి స‌పోర్ట్ ఉన్నప్ప‌టికీ ఆమె త‌న టాలెంట్‌తో ఎంత‌గా మెప్పిస్తుందో చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us