Rajinikanth: ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య విడాకులు.. క‌లిపేందుకు ప్ర‌య‌త్నిస్తున్న ర‌జ‌నీకాంత్

Rajinikanth: ఇటీవ‌లి కాలంలో ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య‌ల విడాకుల వ్య‌వ‌హారం ఎంత పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇద్దరు కూడా అధికారికంగా విడిపోతున్నామని త‌మ త‌మ అధికారిక‌ సోష‌ల్ మీడియా మాధ్య‌మాల ద్వారా తెలియ‌జేశారు. ‘‘స్నేహితులుగా, భార్యాభర్తలు, శ్రేయోభిలాషులుగా 18 సంవత్సరాలుగా కలిసి ప్రయాణించాం. ఇప్పుడు మా దారులు వేర‌య్యాయి. వాటిలో ప్ర‌యాణించ‌డానికి సిద్ధ‌మ‌య్యాం. నేను, ఐశ్వ‌ర్య విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం.

Rajinikanth Upset Over Dhanush and Aishwarya
Rajinikanth Upset Over Dhanush and Aishwarya

మా వ్య‌క్తిగ‌త స‌మ‌యాన్ని వెచ్చించాల‌ని నిర్ణ‌యించుకున్నాం. మా నిర్ణ‌యాన్ని గౌర‌వించండి. ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌డానికి గోప్య‌త అవ‌స‌రం. దాన్ని మాకు క‌ల్పించండి’’ అని ధ‌నుష్ లేఖ‌లో పేర్కొన్నారు. అలాంటి లేఖ‌నే ఐశ్వ‌ర్యా ర‌జినీకాంత్ కూడా పోస్ట్ చేశారు. 2004 న‌వంబ‌ర్ 18న వీరిద్ద‌రూ పెద్ద‌ల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి యాత్ర‌, లింగ .. ఇద్ద‌రు కుమారులున్నారు.

ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య‌ల విడాకుల వ్య‌వ‌హారం చాలా మందికి బాధ‌ను క‌లిగిస్తుంది. అటు కుటుంబ సభ్యులే కాక అభిమానులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తాజాగా వీరి విడాకులపై ఇటీవ‌ల హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు. ధనుష్, ఐశ్వర్యల మధ్య మనస్పర్ధలు వచ్చాయని, అందుకే వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వారు ఇద్దరూ చెన్నైలో లేరని, ఈ విషయంపై నేను వారితో ఫోన్‌లో మాట్లాడానని, నాతో పాటు ఐశ్వర్య తండ్రి రజినీకాంత్ కూడా విడాకుల విషయంపై మరోసారి ఆలోచించాలని చెప్పారని తెలిపారు.

Rajinikanth Upset Over Dhanush and Aishwarya
Rajinikanth Upset Over Dhanush and Aishwarya

చెన్నైకి వచ్చాక నేను, రజినీకాంత్ వారిద్దర్నీ కూర్చోబెట్టి మాట్లాడతామని అన్నారు. త్వరలోనే వారిద్దరు మళ్లీ కలుస్తారని చెప్పారు కస్తూరిరాజా. ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య విడాకుల ఎఫెక్ట్ ర‌జ‌నీకాంత్‌పై కూడా బాగానే ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఆయ‌న కూతురు విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకోగా, ఇప్పుడు ఐశ్వర్య విడాకులు తీసుకోవ‌డం ర‌జ‌నీకాంత్‌ని ఎంత‌గానో బాధిస్తుంద‌ట‌.

ధ‌నుష్‌- ఐశ్వ‌ర్య విడాకులు రజనీని తీవ్రంగా ప్రభావితం చేశాయని వార్తలు వస్తున్నాయి. ఇది తాత్కాలిక వైరం మాత్రమేనని చెబుతూనే ఆయన మళ్లీ కలిసిపేందుకు ప్రయత్నిస్తున్నార‌ని టాక్ న‌డుస్తుంది. ఇది ర‌జ‌నీకాంత్‌కి చాలా బాధాక‌ర‌మైన స‌మ‌యం. ఆయ‌న‌కు దేవుడు మ‌రింత ధైర్యం ఇవ్వాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.