Rajinikanth: రేపు ర‌జ‌నీకాంత్‌కు మ‌ర‌చిపోలేని రోజు.. ఎందుకో తెలుసా?

Rajinikanth సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌కి అశేష‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న సినిమాల‌లో స‌రికొత్త ట్రెండ్ సృష్టించారు. ఇక రాజ‌కీయాల‌లోను కొత్త ద‌నం తీసుకురావాల‌ని ఎంతో భావించ‌గా, అనారోగ్యం వ‌ల‌న రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. అయితే రేపు త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కు రేపు మ‌రిచిపోలేని రోజు. ఈ విష‌యాన్ని ఇవాళ ఉద‌యం ట్విటర్ ద్వారా తెలియ‌జేశారు.

TheNewsQube-

సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు తనని వరించడం పట్ల అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం దిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో రజనీకాంత్‌ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం చెన్నైలోని తన నివాసం వద్ద రజనీ మీడియాతో మాట్లాడారు.

‘‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆ అవార్డు నాకు వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. ఈ సమయంలో నా గురువు కె.బాలచందర్‌ మన మధ్య లేకపోవడం నాకెంతో బాధగా ఉంది’’ అని రజనీ తెలిపారు. అనంతరం రజనీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రేపు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని అన్నారు.

దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకోవడంతోపాటు తన కుమార్తె సౌందర్య విఘ్నేశ్‌ ఎంతో శ్రమించి సిద్ధం చేసిన ‘హూట్‌ యాప్‌’ని తాను విడుదల చేయనున్నట్లు రజనీ తెలిపారు. మరోవైపు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును రజనీకాంత్‌కు ఇవ్వనున్నట్లు ఏప్రిల్‌ నెలలోనే కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్ర‌జ‌లు అన్ని భాష‌ల్లో త‌మ గొంతుక‌ను, వారి ఆలోచ‌న‌లు, విషెస్‌, ఐడియాల‌ను రాత‌పూర్వ‌కంగా హూటే ఈ ప్లాట్‌ఫాం ద్వారా పంచుకునే వీలుంటుంది. సౌంద‌ర్య ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ప్ర‌పంచానికి తెలియ‌జేస్తుంద‌ని ట్వీట్ చేశారు ర‌జినీకాంత్‌. ఇలాంటి వినూత్న‌మైన యాప్‌ను లాంఛ్ చేయ‌డం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా ఉప‌యోగ‌క‌ర‌మైనది. ఇలా నేను వాయిస్ అందించ‌డం మొద‌టిసారి అంటూ ట్వీట్ చేశారు.