RAJINIKANTH : సాఫీ సాగుతున్న ప్రయాణానికి కరోనా మహమ్మారి అడ్డుకట్ట వేసింది. ఈ మాయదారి రోగం వలన ఒకరిని ఒకరు కలవలేకపోతున్నాం అంటే దీని విజృంభన ఏ రకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వయస్సుపై బడిన వాళ్లను కరోనా ఎంతగా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం కరోనా కాటుకు బలై కన్నుమూసిన విషయం తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు చాలా మంది కరోనా వలన గత ఏడాది కన్నుమూశారు. ఈ పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని రజనీకాంత్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఈ మహమ్మారికి భయపడి తాను రాజకీయాలకు కూడా దూరంగా ఉండనున్నట్టు ఇటీవల ప్రకటించారు.
ప్రస్తుతం రజనీకాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అన్నాత్తే షూటింగ్ సమయంలో ఆయనకు సడెన్గా హై బీపీ రావడం వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది. మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిన రజనీ అప్పటి నుండి ఇంటికే పరిమితం అవుతూ వైద్యులు చెప్పిన సలహాలు పాటిస్తున్నారు. అనారోగ్యం కారణంగా మానసిక ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకున్నప్పటికీ, సినిమాలు చేస్తాడని అందరు భావించారు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్నాత్తే చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని మేకర్స్ ప్రకటించారు.
పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా అన్నాత్తె వస్తుండగా, ఈ చిత్రాన్ని వేదాళం, విశ్వాసం లాంటి వరస విజయాలతో దూసుకుపోతున్న శివ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో తలైవా ప్రేక్షకులని తప్పక అలరిస్తారని అభిమానులు విశ్వసిస్తున్నారు. అయితే హైదరాబాద్లో షూటింగ్ పూర్తైన తర్వాత ఈ చిత్ర షూటింగ్ తిరిగి మొదలు కాలేదు. ఈ నెలలో మొదలు పెడదాం అనుకునే సరికి మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రజనీకాంత్ షూటింగ్కు బ్రేక్ ఇవ్వాలనే నిర్ణయంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో రజినీకాంత్ బయటికి రావడం అంత శ్రేయస్కరం కాదు అంటున్నారు వైద్యులు. దీంతో అన్నాతే అంటే షూటింగ్ మరింత ఆలస్యం కానుంది.