RAJINIKANTH: ర‌జ‌నీకాంత్ సినిమాల‌కు దూరం కానున్నారా… ఆయ‌న మాట‌ల‌లో అర్ధం ఏమిటి ?

మూడు ద‌శాబ్ధాల‌కు పైగా త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ని ఉర్రూత‌లూగిస్తున్న న‌టుడు ర‌జ‌నీకాంత్. దేశ విదేశాల‌లో ర‌జ‌నీకాంత్‌కు అశేష‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్ర‌స్తుతం శివ ద‌ర్శ‌క‌త్వంలో అన్నాత్తె అనే సినిమా చేస్తుండ‌గా, ఇటీవ‌ల ఈ మూవీ చిత్రీక‌ర‌ణ పూర్తి చేశారు. చాలా క‌ష్టాలు ప‌డి సినిమా షూటింగ్ పూర్తి చేయ‌గా, గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న‌ప్పుడు ర‌జ‌నీకాంత్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆ స‌మ‌యంలో రాజ‌కీయాల‌ని ప‌క్క‌న పెట్టిన త‌లైవా సినిమాల‌కు కూడా దూరం అవుతార‌ని అన్నారు. కాని ఎలాగో అలాగా అన్నాత్తె చిత్ర షూటింగ్ పూర్తి చేశారు.

శివ దర్శకత్వంలో అన్నాత్తే చిత్రాన్ని పూర్తి చేసిన సందర్భంగా ర‌జ‌నీకాంత్ త‌న మనసులోని మాటను చిత్ర యూనిట్‌తో పంచుకున్నారు. అన్నాత్తే చిత్రం సంతృప్తిగా వచ్చిందన్నారు. అయితే ఇంకా మరికొన్ని చిత్రాలలో నటించాలనే ఆకాంక్ష ఉందని కానీ నా వయస్సు అందుకు సహకరిస్తుందా అనే విషయం.. ఆ భగవంతుడు ఇచ్చే శక్తిపై ఆధారపడి ఉంటుందని రజనీకాంత్‌ పేర్కొనట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఏడు ప‌దుల వ‌య‌స్సు ఉన్న ర‌జ‌నీకాంత్ మాట‌లు వింటుంటే రానున్న రోజుల‌లో ఆయ‌న సినిమాలు చేయ‌డం క‌ష్ట‌మే అనిపిస్తుంది. కాగా కరోనా ఉధృతి తగ్గిన తరువాత రజనీకాంత్‌ అమెరికాకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.