Rajinikanth: ర‌జ‌నీకాంత్ సినిమాల‌కు కూడా గుడ్ బై చెప్ప‌బోతున్నారా..!

Rajinikanth: సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కొన్ని దశాబ్ధాలుగా త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ర‌జ‌నీకాంత్ న‌ట‌న‌కు మ‌న‌దేశంలోనే కాదు విదేశాల‌లోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ర‌జ‌నీకాంత్ పేరు చెబితే ఆయ‌న అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. ఏదో ఒక రోజు ర‌జ‌నీకాంత్‌ని సీఎం సీట్‌లో చూడాలని అభిమానులు ఎంతగానో ఆశించారు.

Rajinikanth

అనారోగ్యం వ‌ల‌న ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాలు చేయ‌న‌ని చెప్ప‌డంతో వారి ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి. అయితే ప‌లు ద‌ఫాలుగా మీటింగ్‌లు జ‌రిగిన త‌ర్వాత ర‌జ‌నీకాంత్ పార్టీ ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని అంద‌రు భావిస్తున్న క్ర‌మంలో ఆయ‌న అనారోగ్యానికి గుర‌య్యాడు. ఇలాంటి ప‌రిస్థితుల‌లో ఎలాంటి టెన్ష‌న్ తీసుకోకూడ‌ద‌ని డాక్ట‌ర్స్ చెప్ప‌డంతో ఇక తాను రాజ‌కీయాల‌లోకి రాలేనంటూ గ‌త ఏడాది అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాడు త‌లైవా.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటీవ‌ల శివ ద‌ర్శ‌క‌త్వంలో అన్నాత్తె అనే సినిమా చేశాడు ర‌జనీకాంత్. ఈ సినిమా దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 4న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో రజనీతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు, సూరి, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీ నటించాల్సిన సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.

ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్నందని సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్‌ ఊరి పెద్దగా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారట. అన్నాత్తే కంటే ముందు రజనీ దర్భార్ అంటూ వచ్చాడు. మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మధ్య సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న రజనీకాంత్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు ఆయన అభిమానులు.

రజనీకాంత్ 2016 మేలో అమెరికాలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చెక్ అప్ కోసం అమెరికా వెళ్తున్నారు. అందులో భాగంగానే ఆయన రీసెంట్‌గా అమెరికా వెళ్లారు. అక్కడ మయో క్లినికల్‌ ఆస్పత్రిలో రజనీకాంత్‌కు వైద్యులు పలు రకాల పరీక్షలు చేశారు. అన్ని పరీక్షలలోను ఎలాంటి సమస్యలు లేవని తేలతడంతో రజనీకాంత్ తిరిగి ఈరోజు చెన్నైకి వచ్చారు.

చెన్నై నుండి వ‌చ్చిన ర‌జ‌నీకాంత్ అభిమానులతో మీటింగ్ ఏర్పాటు చేసే ప‌నిలో ఉన్నారు. అన్ని జిల్లాల‌కు సంబంధించిన అధ్య‌క్షుల‌ను ఈ మీటింగ్‌కి ఆహ్వానించ‌నుండ‌గా, అందులో తాను ఇక సినిమాలు చేయ‌లేన‌ని చెబుతార‌ట‌. అమెరికా డాక్ట‌ర్స్ చెప్పిన సల‌హా మేర‌కు ర‌జ‌నీ త‌న అభిమానుల‌కు ఈ విష‌యాన్ని తెలియ‌జేసి ఆ త‌ర్వాత అఫీషియ‌ల్‌గా సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టిస్తార‌ట‌. రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పే స‌మ‌యంలో అభిమానుల‌తో మీటింగ్ ఏర్పాటు చేసిన ర‌జనీ ఇప్పుడు సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌బోతున్న నేప‌థ్యంలోనే అభిమానులతో మ‌ళ్లీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నార‌ని కోలీవుడ్ తంబీలు అంటున్నారు.