Rajinikanth : చంద్ర‌బాబుకి ర‌జ‌నీకాంత్ ఫోన్.. భారీగా పెరుగుతున్న మ‌ద్ద‌తు

Rajinikanth : 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న చంద్రబాబు, శుక్రవారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చిన్న పిల్లాడిలా ఏడ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పటివరకు చంద్రబాబు విలపించిన సందర్భాన్ని ఎప్పుడూ టిడిపి నేతలు చూడలేదు. అత్యంత బాధాకరమైన సంఘటనలలో కూడా ఆయన కన్నీటిని ఆపుకొని ఆ బాధకు ఉపశమనం కలిగే మార్గాలను అన్వేషించి తదనుగుణంగా వ్యవహరిస్తారు.

Rajinikanth call to chandra babu naidu 1
Rajinikanth call to chandra babu naidu

అలాంటి చంద్రబాబు ఒక్కసారిగా భావోద్వేగానికి గురై, వెక్కి వెక్కి ఏడవడంతో తెలుగు తమ్ముళ్ళు దిగ్భ్రాంతికి గురయ్యారు. వైసీపీ ప్రభుత్వ పాలన పై, సీఎం జగన్మోహన్ రెడ్డి పై నిప్పులు చెరుగుతున్నారు. బాబును ఏడ్పించిన వారిపై అంతకు అంత పగ తీర్చుకుంటామని తేల్చి చెబుతున్నారు. చంద్రబాబును సీఎం చేసి తీరుతామని పసుపు ప్రతిజ్ఞలు చేస్తున్నారు.

Rajinikanth call to chandra babu naidu
Rajinikanth call to chandra babu naidu

చంద్రబాబుకి తెలుగు త‌మ్ముళ్లే కాదు సినీ సెల‌బ్రిటీలు కూడా మ‌ద్దుతు ఇస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పరామర్శించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనల ను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్‌ శనివా రం ఉదయం చంద్రబాబుకు ఫోన్‌ చేసి విచారం వ్యక్తం చేశారు.

మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత మైత్రేయన్‌ కూడా చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అనంతరం, ‘నాకు 1984 నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని బాధపడ్డాను. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడాను’ అని మైత్రేయన్‌ ట్వీట్‌ చేశారు.

ప్రకాశ్ రాజ్‌తో పాటు చాలామంది ప్రముఖులు చంద్రబాబు కుటుంబానికి జరిగిన అవమానంపై ఇప్పటికే స్పందించారు. ఎన్‌టీఆర్ కుటుంబం అంతా ఒకే చోట చేరి వైసీపీ సభ్యుల దూషణలను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై ఎన్‌టీఆర్ కుటుంబమంతా ఏకతాటిపై ఉందని అభిమానులకు సందేశాన్ని పంపించినట్లయ్యింది.