RAJINIKANTH: 70 ఏళ్ల వ‌య‌స్సులో రిస్క్ చేస్తున్న ర‌జ‌నీకాంత్.. ఇది అవ‌స‌ర‌మా అంటున్న ఫ్యాన్స్

అసలే రజినీకాంత్ ఆరోగ్యం కొన్ని రోజులుగా అంతంతమాత్రంగానే ఉంది. ఈయనలో వయోభారం కూడా కనిపిస్తుంది. అందుకే మునపటితో పోలిస్తే ఇప్పుడు సినిమాలకు కూడా దూరంగానే ఉన్నాడు. ఈ కారణంతోనే ఈయన రాజకీయాలకు కూడా శాశ్వతంగా దూరమైపోయాడు. తను పాలిటిక్స్ చేయలేనని చెప్పేసాడు. అనారోగ్యం కారణంగా మానసిక ఒత్తిడికి లోను కాలేనని చెప్పాడు సూపర్ స్టార్. ఇదిలా ఉంటే దీనికంటే ముందే గతేడాది ఈయన శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమాకు కమిటయ్యాడు. ఆ సినిమా షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసంది. మొన్నటి వరకు కూడా హైదరాబాద్ లోనే షూటింగ్ జరిగింది. అయితే ఉన్నట్లుండి అనారోగ్యం పాలు కావడంతో చెన్నై వెళ్లిన రజినీ అక్కడే రెస్ట్ తీసుకున్నాడు.

ఆ తర్వాత మళ్లీ షూటింగ్ అనుకున్నా కూడా కుదర్లేదు. దాంతో శివ మరో సినిమా చేయాలనుకున్నాడు. ఇదిలా ఉంటే అన్నాత్తే సినిమా ఆగిపోయిందని కొందరు.. కాదు ఆలస్యం అవుతుందని మరికొందరు చెప్పారు. కానీ రెండో మాటే నిజమైంది. 2021 సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమా కాస్తా ఇప్పుడు నవంబర్ 4కు వెళ్లిపోయింది. అప్పుడు కూడా వచ్చేది అనుమానమే. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం వస్తుంది. వేదాళం, విశ్వాసం లాంటి వరస విజయాలతో దూసుకుపోతున్న శివ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో రజినీ అభిమానులు కూడా నమ్మకంగానే ఉన్నారు. ఈ సినిమాలో రజినీ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.

అన్నాత్తే కచ్చితంగా రజినీ కోరికను నెరవేరుస్తుందని.. హిట్ లోటు భర్తీ చేస్తుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్ అన్నీ వాయిదా వేసుకుంటున్నారు హీరోలు. ఇలాంటి సమయంలో రజినీకాంత్ మాత్రం రిస్క్ తీసుకుంటున్నాడు. ఈయన అన్నాత్తే షూటింగ్ హైదరాబాద్ ఆర్ఎఫ్‌సీలో జరుగుతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే షూటింగ్ చేస్తున్నారు టీం. ఇప్పటికే ఇక్కడ షూట్ చేస్తున్నపుడే టీమ్ కు కరోనా వచ్చింది. అయినా కూడా ఇప్పుడు రజినీ రిస్క్ చేస్తున్నాడు. బయట కరోనా ఇంత దారుణంగా ఉన్న సమయంలో రజినీకాంత్ షూటింగ్ లో పాల్గొంటుండటంతో అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. 70 ఏళ్ళ వయసులో ఈ రిస్క్ ఎందుకు తలైవా.. హాయిగా ఇంట్లో ఉండకా అంటూ చెప్తున్నారు. కానీ రజినీకాంత్ మాత్రం అన్నాత్తే షూటింగ్ అయిపోతే ఓ పనైపోతుంది అనుకుంటున్నాడు.

Advertisement