Rajendra prasad: టాలీవుడ్‌లో మ‌రో క‌రోనా కేసు.. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న రాజేంద్ర‌ప్ర‌సాద్

Rajendra prasad: కరోనా మ‌హ‌మ్మారి గుబులు పుట్టిస్తుంది. సామాన్యుల క‌న్నా సెల‌బ్స్ ఎక్కువగా క‌రోనా బారిన ప‌డుతుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఇప్ప‌టికే టాలీవుడ్ లో మ‌హేష్ బాబు, విశ్వ‌క్ సేన్, మంచు మ‌నోజ్, మంచు ల‌క్ష్మీ క‌రోనా బారిన ప‌డ‌గా, తాజాగా రాజేంద్ర ప్ర‌సాద్ క‌రోనా బారిన ప‌డ్డారు.

raendra prasad gets corona positive
raendra prasad gets corona positive

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌కు స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్టు ఏఐజీ వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ ఆరోగ్యం నిలకడగా ఉందని వారు అన్నారు. ఇటీవల ఆహాలో విడుదలయిన ‘సేనాపతి’ సినిమాలో రాజేంద్రప్రసాద్ నటనకు పలువురు సెలబ్రిటీల దగ్గర నుండి ప్రశంసలు అందుకున్నారు. అలాంటి రాజేంద్రప్రసాద్‌కు కరోనా అనే వార్త ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేసింది.

రాజేంద్ర‌ప్ర‌సాద్ సేనాప‌తి ద్వారా ఓటీటీలోకి అడుగుపెట్టారు. ప్రేమ ఇష్క్ కాద‌ల్ వంటి చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శకుడు ప‌వ‌న్ సాధినేని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ ఈ సిరీస్‌ను నిర్మించారు. న‌రేష్ అగ‌స్త్య, జ్ఞానేశ్వర్ కందేర్గుల‌, హ‌ర్షవ‌ర్దన్‌, రాకేందు మౌళి త‌దిత‌రులు ఇత‌ర ప్రధాన పాత్రల్లో న‌టించారు.

సాధార‌ణంగా రాజేంద్ర ప్రసాద్ పేరు చెబితే ఆయ‌న మ‌నల్ని వివిధ పాత్రల‌తో ఎలా న‌వ్వించారో ఆ పాత్రలే గుర్తుకు వ‌స్తాయి. సేనాప‌తి సిరీస్‌లో మూర్తి అనే సీరియ‌స్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ క‌నిపించ‌నున్నారు. ఆయ‌న‌తో పాటు బ‌ల‌మైన పాత్రల్లో మంచి ఆర్టిస్టులు స‌హ తారాగ‌ణం న‌టించారు.

raendra prasad gets corona positive
raendra prasad gets corona positive

యూత్, అనుభ‌వం ఉన్నవారు కాంబినేష‌న్‌లో రూపొందిన సేనాప‌తి టైట్ స్క్రీన్ ప్లే, ప‌వ‌ర్ ప్యాక్డ్ నెరేష‌న్‌, షార్ప్ పెర్ఫామెన్‌సెస్‌, యూనిక్ ప్లాట్‌తో ఆడియెన్స్‌ను అల‌రించింది.