ఎయిర్ పోర్ట్ లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ త‌ల‌చుకొని ఎమోష‌న‌ల్ అయిన సుమ భ‌ర్త‌

సాధార‌ణ స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు వారి వారి ప‌నుల‌తో ఎంతో బిజీగా ఉంటుంటారు. ఒక్కోసారి కుటుంబ స‌భ్యుల‌తో సమ‌యం గ‌డిపే తీరిక కూడా కొంద‌రికి ఉండదు. అలాంటి స‌మ‌యంలో క‌రోనా మ‌హ‌మ్మారి అంద‌రిని ఇంట్లో క‌ట్టిప‌డేసింది. నిత్యం షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉండే సెల‌బ్స్ కూడా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యిరు. ఖాళీ స‌మ‌యాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియ‌క కొంద‌రు సోష‌ల్ మీడియాతో బిజీ అవుతున్నారు.

Rajeev Kanakala Post his Fan Pic in Twitter
Rajeev Kanakala Post his Fan Pic in Twitter

అప్పుడ‌ప్పుడు గ‌త స్మృతుల‌ని నెమ‌ర‌వేసుకుంటూ నెటిజ‌న్స్‌ని ఆనందింప‌జేస్తున్నారు. తాజాగా సుమ భ‌ర్త‌, న‌టుడు రాజీవ్ క‌న‌కాల మూడేళ్ల క్రితం జ‌రిగిన సంఘ‌ట‌నకు సంబంధించిన విష‌యాన్ని ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌గా, ఇది నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

రాజీవ్ క‌న‌కాల మంచి న‌టుడు అన్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. చాలా మంది స్టార్ హీరోల‌తో క‌లిసి పని చేసిన రాజీవ్ క‌న‌కాల కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర‌లు చేశాడు. ఈ మ‌ధ్య‌కాస్త సినిమాలు త‌గ్గించిన‌ట్టు తెలుస్తుంది. అయితే ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికి ప‌రిమితం అయి ఉన్న రాజీవ్ 2018లో ఓ అభిమానితో సెల్ఫీ తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు.

అంతేకాదు దాని వెనుక ఉన్న క‌థ‌ని వివ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. 2018లో చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో న‌డుచుకుంటూ వెళుతున్నాను. అక్క‌డ క్లీనింగ్ డిపార్ట్‌మెంట్‌లో ప‌ని చేసే వ్యక్తి ప‌రుగెత్తుకుంటూ నా ద‌గ్గ‌క‌కు వ‌చ్చాడు. అత‌ని మొహంలో ఉత్సాహం చూసి ఆశ్చ‌ర్య‌పోయాను.

నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకున్న ఆ వ్య‌క్తి , తన దగ్గర స్మార్ట్‌ ఫోన్‌ లేదని నా ఫోన్‌లోనే సెల్ఫీ తీయమని కోరాడు. నేను తీశాను. ఆ ఫోటోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయాల‌ని అనుకున్నా, కాని మ‌రిచిపోయాను. ఇప్పుడు ఆ ఫొటోని పోస్ట్ చేశాను. ఈ ఫొటో ఆ వ్య‌క్తికి చేరి, సేవ్ చేసుకుంటాడ‌ని ఆశిస్తున్నాను అంటూ రాజీవ్ క‌న‌కాల త‌న సోష‌ల్ మీడియాలో పేర్కొన్నారు.

అయితే మూడు సంవ‌త్స‌రాల క్రితం అభిమానితో దిగిన ఫొటోని భ‌ద్రంగా దాచుకోవ‌డంతో రాజీవ్ క‌న‌కాల‌పై నెటిజ‌న్స్ ప్ర‌శంసలు కురిపిస్తున్నారు. కాగా, రాజీవ్ క‌న‌కాల ప్ర‌స్తుతం త‌న సతీమ‌ణి సుమ‌తో పాటు పిల్ల‌ల‌తో క‌లిసి ఇంటికే ప‌రిమిత‌మయ్యాడు. త్వ‌ర‌లో త‌న కుమారుడు హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.