రాజ‌శేఖ‌ర్ త‌న‌య‌లా, మ‌జాకానా?.. వారు చేసిన గొప్ప ప‌నికి కురుస్తున్న ప్ర‌శంస‌ల జ‌ల్లు

టాలీవుడ్ లో టాప్ మోస్ట్ యాంగ్రీ మెన్ గా సక్సెస్ సాధించారు హీరో రాజశేఖర్. పోలీస్ పాత్రల్లో జీవించి ప్రేక్షకులను మైమరిపించారు. ఎన్నో పవర్ ఫుల్ యాక్షన్ పాత్రల్లో నటించి మెప్పించిన ఘనత రాజశేఖర్ ది. రీసెంట్ గా కల్కి, సీక్రెట్ ఇన్వెస్టిగేటర్ పాత్రల్లో నటించిన రాజశేఖర్.. ఇప్పుడు ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శేఖర్ అనే సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు సినిమా టీమ్. ఈ లుక్ లో రాజశేఖర్ లుక్ కి అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అందులోనూ రాజశేఖర్ సినీ కెరీర్ లో 91 సినిమాగా తెరకెక్కుతుంది. ఈ లుక్ లో యాంగ్రీ యంగ్ మెన్ లా కనిపిస్తూ.. ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు.

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన వ్యక్తిగా.. కెరీర్ ప్రారంభంలో అంకుశం, తలంబ్రాలు లాంటి కంప్లీట్ యాక్షన్, కోపం లాంటి సినిమాలతో పోలీస్ పాత్రల్లో తన సత్తా చాటుకున్నారు. అప్పట్లో పోలీస్ కారెక్టర్లకే క్రేజ్ వచ్చేలా చేశారు. ఎవరైనా ఏం కావాలనుకుంటున్నారని అడిగితే.. రాజశేఖర్ లా పోలీస్ ఆఫీసర్ కావలనుకుంటున్నామనేంతగా పాపులారిటీ సంపాదించుకున్నారు.

లేటెస్ట్ గా శేఖర్ సినిమాలో రాజశేఖర్, పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారట. పోలీస్ పాత్రలకు ఆయనకు ఆయనే సాటి. మరి అలాంటప్పుడు పోలీస్ క్యారెక్టర్ లో రాజశేఖర్ ఒదిగిపోతాడనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ సినిమాకు లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ని ఈ నెల 22 నుండి ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకున్న మరో హైలెట్ ఏంటంటే.. రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మకలు ప్రొడ్యూసర్ లుగా మారబోతున్నారు. ఈ సినిమాకి సంబందించిన కాస్టింగ్ విషయంలో ఇంకా ఫైనల్ కాలేదు. ఈ సినిమా కోసం అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నట్లు తెలుస్తుంది. రాజశేఖర్ సినీ కెరీర్ లో మరో హిట్ ని తన ఖాతా వేసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాలీవుడ్ టాక్.

Advertisement