Gopichand: గోపిచంద్ చిత్రంలో సీనియ‌ర్ హీరో.. ఆశ్చ‌ర్య‌పోతున్న ఫ్యాన్స్

Gopichand: గోపిచంద్ జోరు మీదున్నాడు. రీసెంట్‌గా వ‌చ్చిన సీటీమార్ చిత్రం విజ‌య్ సాధించ‌డంతో త‌ర్వాతి సినిమాలు ఉత్సాహంగా చేస్తున్నాడు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రంచేస్తున్న యాక్షన్ హీరో గోపీచంద్ మరో క్రేజీ కాంబినేషన్ లో సినిమా మొదలుపెట్టాడు.

Rajasekhar to act in Gopichand Upcoming Movie
Rajasekhar to act in Gopichand Upcoming Movie

గోపీచంద్ కెరియర్ లో లక్ష్యం సినిమా ముమ్మాటికీ భారీ సక్సెస్ సినిమానే. అనుష్క, జగపతి బాబు, కోటా శ్రీనివాస్ రావు లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పటికే టీవీల్లో అదే ఆదరణ దక్కించుకుంటుంది. లక్ష్యం సినిమాతో శ్రీవాస్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో లౌక్యం అనే మరో సినిమా కూడా రూపొందింది.

అప్పటికే వాంటెడ్, మొగుడు లాంటి ప్లాపులలో ఉన్న గోపీచంద్ కు లౌక్యం రిలీఫ్ ఇచ్చింది. కాగా, ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మూడవ సినిమా సెట్టైంది. గోపీచంద్‌ కెరీర్‌లో ఇది 30వ సినిమా కాగా పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. భూపతిరాజా కథ విన్న గోపీచంద్‌ వెంటనే ఒకే చెప్పగా దర్శకుడు శ్రీవాస్‌తో మరోసారి అసోసియేట్‌ అవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.

ఇందులో సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ కీలక పాత్ర పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. ఆయ‌న పాత్ర ఆక‌ట్టుకునేలా ఉంటుంద‌ని అంటున్నారు. కోల్‌కత్తా బ్యాక్ డ్రాప్ లో సాగే కథగా కనిపిస్తుంది. ఇటీవ‌ల విడుద‌లైన పోస్టర్ లో హౌరా బ్రిడ్జితో పాటు ప్రజలు గూమికూడి ట్రాఫిక్‌తో ఉన్న కోల్‌కత్తాలో ఫేమస్‌ కాళీమాత విగ్రహం కనిపిస్తున్నాయి.

ఈ అంశాలు గోపీచంద్, శ్రీవాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్‌ చేస్తున్నాయి. అలాగే ఈ సినిమా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో మరింత ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా టైటిల్‌ ఖరారు కావాల్సి ఉంది. మ‌రి ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతారా లేదా అన్నది చూడాలి.