క‌రోనాతో చాలా బాధ‌ప‌డ్డ రాజ‌శేఖ‌ర్.. అనుభ‌వాలు వివ‌రిస్తూ ఎమోష‌న్

క‌రోనా మ‌హ‌మ్మారి సెల‌బ్రిటీల‌ని సైతం ఎంత‌గా వ‌ణికించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నాగ‌బాబు, త‌మ‌న్నా, రాజ‌మౌళి, కీర‌వాణి వంటి ప‌లువురు సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డి కోలుకున్నారు. అయితే క‌రోనా సోకిన స‌మయంలో వారు ప‌డిన ఆవేద‌న వ‌ర్ణ‌నాతీతం అని చెప్పుకొచ్చారు. ఆ మ‌ధ్య త‌మ‌న్నా నేను చ‌నిపోతానేమో అనే భ‌యం కూడా వేసింద‌ని చెప్పుకొచ్చింది. ఇక ఇటీవ‌ల రాజ‌శేఖ‌ర్‌తో పాటు ఆయ‌న భార్య జీవిత‌, కుమార్తెలు శివాని, శివాత్మిక‌ల‌కు కూడా క‌రోనా పాజిటివ్ నిర్ణార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. కూతుళ్లు ఇద్ద‌రు త్వ‌ర‌గానే కోలుకున్న‌ప్ప‌టికి, రాజ‌శేఖ‌ర్, జీవిత‌లు చాలా రోజులు ఆసుప‌త్రిలో చికిత్స పొందారు.

జీవిత ఓ 15 రోజుల పాటు ఆసుప‌త్రిలో క‌రోనా చికిత్స తీసుకుంది. రాజ‌శేఖ‌ర్ నెల‌కు పైగానే ఉన్నారు. అయితే అంద‌రి ప్రార్ధ‌న‌ల‌తో క్షేమంగా బ‌య‌ట‌పడ్డ రాజ‌శేఖ‌ర్ తాజాగా త‌న అనుభ‌వాలు వివ‌రిస్తూ కాస్త ఎమోష‌న్ అయ్యాడు. తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన రాజ‌శేఖ‌ర్.. జ్వ‌రం, రుచి కోల్పోవ‌డం, శ్వాస స‌మ‌స్య రావ‌డంతో నాకు క‌రోనా అని ఫిక్స్ అయ్యాను. వైద్యం కోసం వెంట‌నే ఆసుప‌త్రికి వెళ్ళాను. అయితే బ్రీతింగ్ స‌మ‌స్య చాలా ఉండ‌డంతో న‌న్ను ఐసీయూలో అడ్మిట్ చేశారు.

క‌రోనా నా ఊపిరితిత్తుల‌పై బాగా ఎఫెక్ట్ చూపించ‌డంతో ఫుడ్ కూడా స‌రిగా తీసుకోలేక‌పోయాను. దీంతో ప‌ది కేజీల బ‌రువు త‌గ్గాను. నా ప‌రిస్థితి దారుణంగా అనిపించి నా వైఫ్‌, పిల్ల‌ల‌ని జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని చెప్పాను. శ్రేయోభిలాషులు, అభిమానులు మరియు వైద్యుల ప్రయత్నాల వల్ల చివరకు కోలుకున్నానని చెప్పారు. రీ ఎంట్రీ చిత్రాలైన గ‌రుడ‌వేగ‌, క‌ల్కితో అద‌ర‌గొట్టిన రాజ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం ప‌లు సినిమా క‌థ‌ల‌ను వింటున్న‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు.

Advertisement
Advertisement