యాంగ్రీయంగ్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ అప్పట్లో యాక్షన్ సినిమాలకు ఎక్కువ ప్రధాన్యత ఇచ్చేవారు. చాలా వరకు ఆవేశంతో కూడుకున్న సినిమాలనే రాజశేఖర్ చేసే వారు. 90ల సమయంలో అగ్రహీరోగా కొనసాగిన రాజశేఖర్ ఇంటెన్సిటి డ్రామా, పవర ఫుల్ పోలీస్, ఎమోషనల్ పాత్రలని కూడా చాలా బాగా పండిస్తారు. అయితే కొన్నాళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉన్న రాజశేఖర్ గరుడ వేగ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి తనలో సత్తా ఏం తగ్గలేదని చెప్పారు
పవన్ కళ్యాణ్ మాదిరిగానే రాజశేఖర్ కూడా తన కెరీర్లో అద్భుతమైన చిత్రాలను చేజేతులారా మిస్ చేసుకున్నాడు. అవి కనుక చేసి ఉంటే రాజశేఖర్ క్రేజ్ మరోలా ఉండి ఉండేదంటూ అభిమానులు చెబుతున్నారు. వెంకటేష్ నటించిన చంటి చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో అమాయకుడిగా నటించాల్సి రావడంతో తనకు సెట్ కాదని రిజెక్ట్ చేశాడు రాజశేఖర్. ఇక జెంటిల్మెన్ చిత్రం కూడా తన దగ్గరకు రాగా, ఆ సమయంలో వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రాజశేఖర్ దీనికి నో చెప్పాడట. శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తమిళంలో విజయ్ కాంత్ హీరోగా తెరకెక్కిన ‘రమణ’ సినిమాను తెలుగులో ఠాగూర్ పేరుతో చిరంజీవి రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్‌గా భారీ విజయం సాధించడంతో పాటు చిరు కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచింది. ఇది కూడా రాజశేఖర్ పోగొట్టుకున్నాడు. అలానే నందమూరి బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహా చిత్రం, జగపతిబాబు, అర్జున్ కలిసిన నటించిన హనుమాన్ జంక్షన్ చిత్రం కూడా రాజశేఖర్ చేయాల్సింది. దగ్గుబాటి రానా, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా కథ కూడా రాజశేఖర్ దగ్గరకు రాగా, క్లైమాక్స్‌లో మార్పులు చేయమని రాజశేఖర్ సూచించడంతో రానా హీరోగా సినిమా తీసాడు తేజ . ఇలా క్రేజీ ఆఫర్స్‌ని మిస్ చేసుకున్న రాజశేఖర్ అవి చేసి ఉంటే ఆయన రేంజ్ మరోలా ఉండేదని అభిమానులు భావిస్తున్నారు.