Rajanna: రాజన్న సినిమాలో కనిపించిన చిన్నారి ఇప్పుడేం చేస్తుందో తెలుసా!

Rajanna: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళీ తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ లో కింగ్ నాగార్జున నటించిన సినిమా రాజన్న. ఈ సినిమా స్వతంత్ర్య సమరయోధుడు రాజన్న పాత్రలో నాగార్జున లీడ్ రోల్ లో నటిస్తున్నారు. 2011లో వచ్చిన రాజన్న సినిమాలో హీరోయిన్ గా స్నేహ నటించారు. ఇక ఈ సినిమాలో రాజన్న కూతురిగా ఓ చిన్నారి నటించిన విషయం తెలిసిందే.

Annie

మల్లమ్మ పాత్రలో నటించిన చిన్న పాప ఎంతోమందిపై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. శత్రువులను సైతం ఎదుర్కుని తన తండ్రి గురించి తెలుసుకునే ప్రయత్నం.. ఆమె పల్లెపై, దేశంపై పాడిన పాటల ఒరవడి ఇప్పటికే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. తన తండ్రి చేసిన పోరాట పటిమ గురించి, దేశం పట్ల తనకున్న ప్రేమను, పోరాటాన్ని, త్యాగాన్ని పాటలుగా అద్భుతమైన సాహిత్యంలో పాటలు పాడింది.

తన అల్టిమేట్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించింది. ఆ చిన్నారి అసలు పేరు అనీ. ఈ సినిమాకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డ్ గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా.. ఇదిలా ఉండగా రాజన్న సినిమా టైమ్ కి అనీకి పదేళ్ళు. ఆమె నాలుగేళ్ళ వయస్సు నుంచే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. చార్మి నటించిన అనుకోకుండ ఒకరోజు సినిమాతో అనీ తన మొదటి సినిమాలో నటించింది.

Annie

ఇక రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కు చెల్లి పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో అవినాష్ డిగ్రీ కాలేజ్ లో కామర్స్ చదువుతోంది. తనకు చిన్నతనం నుండి యాక్టింగ్ మీద మక్కువ అని చాలా సందర్భాల్లో చెప్పింది.

ప్రస్తుతం తన దృష్టి మొత్తం చదువుపైనే ఉన్నట్లు తెలిపింది. ఫ్యూచర్ లో సినిమాలపై ఫోకస్ చేస్తానని అంటోంది అనీ. ఇక బాలనటులుగా వచ్చిన నటులెందరో సినీ ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే బేబి అనీకి కూడా గోల్డెన్ భవిష్యత్ ఉండాలని ఆశిద్దాం..