Rajamouli And Mahesh Babu : మహేష్‌బాబు సినిమాలో హాలీవుడ్ నటుడు: రాజమౌళి రేంజ్ ఇదీ.!

NQ Staff - September 24, 2022 / 11:09 PM IST

Rajamouli And Mahesh Babu : మహేష్‌బాబు సినిమాలో హాలీవుడ్ నటుడు: రాజమౌళి రేంజ్ ఇదీ.!

Rajamouli And Mahesh Babu : రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌‌బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘గ్లోబ్‌ట్రోటర్’ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. గ్లోబ్ ట్రోటర్ అంటే.. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహస వీరుడు అని అర్థమట.

ప్రస్తుతం మహేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కతోంది. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తవగానే మహేష్, రాజమౌళి సినిమా పట్టాలెక్కుతుంది. ప్రస్తుతం రాజమౌళి, మహేష్‌తో సినిమా విషయమై ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడు.

హాలీవుడ్ నటుడితో..

మహేష్ సినిమా కోసం రాజమౌళి ఓ హాలీవుడ్ నటుడ్ని తీసుకురానున్నాడు. హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ తెలుసు కదా.? ‘థోర్’ సినిమాతో క్రిస్ హెమ్స్‌వర్త్ ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులకు సుపరిచితుడే. అలాంటి హాలీవుడ్ ప్రముఖ నటుడ్ని, మహేష్‌తో సినిమా కోసం తీసుకురానున్నాడు రాజమౌళి.

సో, ఓ ‘బాహుబలి’, ఓ ‘ఆర్ఆర్ఆర్’.. ప్రతిసారీ అంతకు మించి.! ఈసారి నిజంగానే గ్లోబల్ సినీ ప్రేక్షకుల్ని మహేష్ సినిమాతో రాజమౌళి టచ్ చేయబోతున్నాడన్నమాట.

పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా కాబోతోంది మహేష్ – రాజమౌళి సినిమా అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us