Rajamouli : విమర్శకుల నోర్లు మూయించిన రాజమౌళి.. తెలుగు వారు గర్వపడే రోజురా ఇది..!
NQ Staff - March 13, 2023 / 10:22 AM IST

Rajamouli : తెలుగు సినిమాకు ప్రపంచంలోనే అగ్ర గామిగా భావించే ఆస్కార్ అవార్డు దక్కింది. ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు సినిమాకు త్రిబుల్ ఆర్ మూవీ చరిత్ర సృష్టించింది. నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో వార్డు దక్కడం నిజంగా గొప్ప విషయమే. ఇది తెలుగు వారికి గర్వపడే రోజు. కాదు కాదు ఇండియా గర్వపడే రోజు.
ఇప్పటి వరకు మన తెలుగు సినిమాకు ఒక్క ఆస్కార్ అవార్డు కూడా రాలేదు. అలాంటిది సుసాధ్యం చేసి చూపించారు త్రిబుల్ ఆర్ మూవీ టీమ్. ఈ సందర్భంగా ఓ విషయాన్ని నెటిజన్లు తెరపైకి తెస్తున్నారు. ఆస్కార్ అవార్డు కోసం త్రిబుల్ ఆర్ మూవీని ప్రమోట్ చేయడానికి రాజమౌళి రూ.80కోట్ల దాకా ఖర్చు పెట్టాడంటూ చాలామంది విమర్శించారు.
అవార్డుతోనే ఆన్సర్..
ఇంకొందరు అయితే అసలు త్రిబుల్ ఆర్ మూవీకి ఆస్కార్ వచ్చేంత సీన్ ఉందా అంటూ ఎగతాళి చేశారు. ఫ్లైట్ టికెట్ ఖర్చులు బొక్కా అంటూ కొందరు సెటైర్లు వేశారు. ఇలాంటి వారందరికీ మౌనంగా ఉంటూనే ఆస్కార్ అవార్డు తెచ్చి చెoప చెల్లు మనిపించేలా సమాదానం చెప్పాడు మన రాజమౌళి.
కార్య దక్షుడిగా పేరు గాంచిన రాజమౌళి.. తలచుకుంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. నిజంగా ఇది తెలుగు వారు గర్వపడే రోజు అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. రాజమౌళి లాంటి వారిని విమర్శించినందుకు సిగ్గు పడాలి అంటూ చెబుతున్నారు. ఎంతైనా వారు చెబుతోంది కూడా నిజమే కదా.