అప్పటి వరకు లవర్ బాయ్‌గా, మాస్ హీరోగా టాలీవుడ్లో గుర్తింపు సంపాధించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్…బాహుబలి ఫ్రాంఛైజీ తో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ వైడ్‌గా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. టాలీవుడ్ స్టార్ గా ఉన్న ప్రభాస్ …ఈ సినిమాలతో పాన్ ఇండియన్ స్టార్ రేంజ్‌కి ఎదిగారు.
పాన్ ఇండియ సినిమాలు చేసే స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఈ ఘనతంతా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిదేనని ప్రత్యేకంగా చెప్పాలి. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బొమ్మలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్ హిట్ గా నిలిచాయి. ఇప్పటి వరకు వీరి కాబినేషన్లో వచ్చిన ఛత్రపతి, బాహుబలి, బాహుబలి-2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి.
అయితే బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో చిత్రం ఎదైనా వస్తే బాగుంటుందని కోరుకునే అభిమానులు లెక్కకు మించి ఉన్నారు. అయితే ఇదే విషయాన్ని ఓ ఇంటర్వూలో అడగ్గా జక్కన్న సరదాగా సమాధానమిచ్చాడు. ప్రభాస్ ని మరోసారి డైరెక్ట్ చేస్తారా అన్న ప్రశ్నకి …వామ్మో మళ్లీ ప్రభాస్‌తోనా..అంటూ షాకిచ్చాడు. మాకు బాహుబలి కోసం దాదాపు 5 ఏళ్లు పట్టింది. మళ్లీ మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకులు తల పట్టుకుంటారంటూ ఆసక్తికతమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రభాస్‌తో సినిమా చేయడమంటే తనకు ఇష్టమని మంచి కథ కుదిరితే తప్పకుండా మళ్లీ మా కాంబినేషన్ రిపీట్ అవుతుందని చెప్పుకొచ్చాడు రాజమౌళి.
ఇక ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ తెరకెక్కిస్తున్న రాజమౌళి ఇటీవలే లాంగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశాడు. అంతేకాదు ఏమాత్రం గ్యాప్ లేకుండా తాజా షెడ్యూల్ తో మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళబోతున్నారు. కాగా భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు మించిపోయాయి. రాజమౌళి విడుదల చేసిన టీజర్స్ కి మెగా అభిమానుల నుంచి అలాగే నందమూరి అభిమానుల నుంచి ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. కాగా సమ్మర్ లో ఆర్ ఆర్ ఆర్ ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు.