RRR : భారీ ఎత్తున ఆర్ఆర్ఆర్ రిలీజ్‌కి స‌న్నాహాలు.. ఎన్ని స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతుందో తెలిస్తే అవాక్క‌వుతారు!

RRR : ప్ర‌స్తుతం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న ఏకైక చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ ఎత్తున రిలీజ్ కానున్న ఈ సినిమాని ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్.. పెన్ స్టూడియోస్.. లైకా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Rajamouli RRR movie release plans
Rajamouli RRR movie release plans

ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ భామా.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా.. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్‌లుక్‌ అంచనాలను మరింత పెంచేశాయి.

Rajamouli RRR movie release plans
Rajamouli RRR movie release plans

మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఇద్దరూ ఈ చిత్రం లో నటిస్తుండటం తో సినిమా పై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో అంతకు మించిన భారీ స్కేల్ తో రాజమౌళి ఈ చిత్రం ను తెరకెక్కించినట్లు ఇటీవల విడుదల అయిన టీజర్ ను చూస్తే తెలుస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని మొత్తం 10,000 కి పైగా స్క్రీన్స్ లో ప్రదర్శించనున్నారు మేకర్స్. అంతేకాక యూ ఎస్ లో కూడా 2,500 కి పైగా స్క్రీన్ లలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఎవర్ రిలీజ్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీ నిలిచే అవకాశం ఉంది.

ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ నుండి క్యారెక్టర్ టీజర్లు, మేకింగ్ వీడియో మాత్రమే విడుదలయ్యింది. కానీ అప్పుడే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇతర సినిమాలలాగా ఆర్ఆర్ఆర్ నుండి పెద్దగా అప్డేట్లు రావట్లేవు. కానీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉత్కంఠ ఏ మాత్రం తగ్గలేదు.