Rajamouli : గ్లోబల్ డైరెక్టర్ : హాలీవుడ్ నిర్మాణ సంస్థతో రాజమౌళి ఒప్పందం.!

NQ Staff - September 22, 2022 / 10:45 PM IST

160178Rajamouli : గ్లోబల్ డైరెక్టర్ : హాలీవుడ్ నిర్మాణ సంస్థతో రాజమౌళి ఒప్పందం.!

Rajamouli : మన జక్కన్న రాజమౌళి పేరు ప్రపంచమంతా ఇప్పటికే మార్మోగిపోతోంది. ఆ పేరు మరింతగా మార్మోగిపోనుంది సమీప భవిష్యత్తులో. ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు. సూపర్ స్టార్ మహేష్‌బాబుతో రాజమౌళి ఓ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.

Rajamouli new film with Hollywood production

Rajamouli new film with Hollywood production

ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. మహేష్‌బాబు కెరీర్‌లో తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసవీరుడి కథగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న మహేష్, ఈ ప్రాజెక్టు పూర్తవగానే, రాజమౌళితో చేయబోయే సినిమాకి సిద్ధమవుతాడు.

గ్లోబల్ డైరెక్టర్.. ఇది మరో సంచలనం.!

హాలీవుడ్ ఏజెన్సీ సీఏఏతో తాజాగా రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంటే, ఇది రాజమౌళి కెరీర్‌లో కనీ వినీ ఎరుగని స్థాయి ప్రాజెక్ట్ కోసమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో రాజమౌళి స్థాయి వేరే లెవల్‌కి వెళుతుందన్నది నిర్వివాదాంశం.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఓటీటీ ద్వారా సందడి చేస్తోన్న విషయం విదితమే. హాలీవుడ్ ప్రముఖులూ ఈ సినిమాపై ఇంకా స్పందిస్తూనే వున్నారు. ఆస్కార్ రేసులోనూ ‘ఆర్ఆర్ఆర్’ నిలుస్తుందనే ప్రచారం జరుగుతున్న వేళ, గ్లోబల్ ఏజన్సీతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నాడన్న వార్త.. మొత్తంగా భారతీయ సినిమాకే గర్వకారణం.