Rajamouli : రాజ‌మౌళితో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ భేటి.. ఎందుకో తెలుసా..!

Rajamouli : ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాని భారీ ఎత్తున విడుద‌ల చేయాల‌ని జ‌క్క‌న్న ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి పోటీగా ప‌వ‌న్ న‌టించిన భీమ్లా నాయక్ కూడా విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. భీమ్లా నాయక్ సినిమాను జనవరి 12 వ తేదీన రిలీజ్ కానుండ‌గా, ఈ సినిమా కారణంగా ఆర్ఆర్ఆర్ కలెక్షన్లకు సమస్య వస్తుందనేది డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన.

Rajamouli meets pawan kalyan about Bheemla nayak release
Rajamouli meets pawan kalyan about Bheemla nayak release

ఈ క్రమంలో ఎస్ ఎస్ రాజమౌళి, పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా కలుసుకుని భీమ్లా నాయక్ విడుదలను వాయిదా వేయమని రిక్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా రాజమౌళి టీమ్ అభిప్రాయపడుతుంది. ఈ మీటింగ్ ను వచ్చే వారం హైదరాబాద్ లో ప్లాన్ చేస్తారట. దీనికన్నా ముందుగానే డీవీవీ దానయ్య, దిల్ రాజు, వంశీతో పాటుగా మరికొంతమంది త్రివిక్రమ్ ను కలవడానికి సిద్ధమవుతున్నారు.

Rajamouli meets pawan kalyan about Bheemla nayak release
Rajamouli meets pawan kalyan about Bheemla nayak release

మ‌రి భీమ్లా నాయ‌క్.. రాజ‌మౌళి మీటింగ్ త‌ర్వాత త‌గ్గుతాడా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక ప‌వ‌న్ రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో సినిమా రావాల‌ని అభిమానులు ఎప్ప‌టి నుండో కోరుకుంటుండ‌గా, అది ఇప్ప‌ట్లో జ‌ర‌గ‌డం క‌ష్ట‌మ‌ని రాజ‌మౌళి ఇటీవ‌ల క్లారిటీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

రాజమౌళి పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని చాలా సంవత్సరాలు వెయిట్ చేశానని, కానీ అది కుదరలేదు అని అన్నారు. ఓ మూవీ షూటింగ్ లో పవన్‌ని కలిశాను. ఆయనతో మాట్లాడితే చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఆ తర్వాత సార్ మీరు చెప్పండి మీకు ఎలాంటి సినిమా చేయాలని ఉంది అని అడిగా. మీరు ఎలాంటి సినిమా అనుకుంటున్నారో అది చెప్పండి. ఎలాంటి సినిమా చేయడానికైనా నేను రెడీ అన్నారు.

సరే సార్ అయితే మీరు టైమివ్వండి. ఏ టైమ్‌లో రమ్మంటే ఆ టైమ్‌లో వచ్చి మీకు కథ చెబుతా అన్నాను. ఆ తర్వాత ఆయన కథ వినడానికి పిలుస్తారు అనుకున్నాను కాని అయన దగ్గరి నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. తర్వాత ఆయన వేరే సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ఈ లోపు నా థింకింగ్ మారిపోయింది. జస్ట్ మాస్ సినిమాలు కాదు, మోర్ బిగ్గర్, వైడర్ రీచ్ ఉన్న సినిమాలు చేయాలని అనుకున్నా. అలా ‘మగధీర’, ‘యమదొంగ’, ‘బాహుబలి’ లాంటి సినిమాలు చేస్తూ వచ్చా.

ఈ లోపు ఆయనకేమో సినిమాలకంటే రాజకీయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు నాతో సినిమా అంటే షూటింగ్ కి చాలా టైం పడుతుంది. అంత టైం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన ఇవ్వలేరు. ప్రస్తుతం మేమిద్దరం వేరు వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నాము. కలుస్తామో లేదో తెలీదు. భవిష్యత్తులో సినిమా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని అన్నారు. కాని ఆయనతో నేను సినిమా చేసిన చేయకపోయినా పవన్ అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం కూడా అని అన్నారు.