RRR Movie : ఆర్ఆర్ఆర్ 2 ఉంది.. అందరు షాక్ అయ్యే అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి
NQ Staff - November 13, 2022 / 03:17 PM IST

RRR Movie : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా యొక్క సీక్వెల్ గురించి తాజాగా సోషల్ మీడియా లో ప్రచారం మొదలు అయింది. రాజమౌళి ఆ విషయం మరింత స్పష్టత ఇవ్వడం జరిగింది.
ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ నామినేషన్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయం లోనే సినిమా యొక్క సీక్వెల్ ఉంటుందని.. మా నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు అంటూ అధికారికంగా ప్రకటించాడు.
సినిమా యొక్క సీక్వెల్ కి సంబంధించిన అన్ని విషయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. జక్కన్న రాజమౌళి గతం లో ఎప్పుడూ లేని విధంగా సినిమా యొక్క సీక్వెల్ విషయమై చాలా సీరియస్ గా ఉన్నాడని.. ఈ సినిమా కు ఆయన సీక్వెల్ చేసి మరో అద్భుతాన్ని ఆవిష్కరించాలని భావిస్తున్నట్లుగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
అతి త్వరలోనే సీక్వెల్ గురించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరో వైపు మహేష్ బాబుతో సినిమా కు సంబంధించిన ఏర్పాట్లు కూడా రాజమౌళి చేస్తున్నాడు. ఒకే సారి ఇలా రెండు సినిమా లకు సంబంధించి ఏర్పాట్లు చేయడం రాజమౌళి ఇదే మొదటి సారి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.