RRR : కోట్ల రూపాయల పబ్లిసిటీ వల్లే ఆర్‌ఆర్ఆర్ కి అంతర్జాతీయ పురష్కారాలు!
NQ Staff - January 23, 2023 / 10:41 PM IST

RRR : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన రికార్డులను నమోదు చేస్తూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే.
గోల్డెన్ గ్లోబ్ అవార్డు సహా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు ఈ సినిమా కు లభించాయి. అతి త్వరలోనే ఆస్కార్ నామినేషన్స్ ని ప్రకటించబోతున్నారు. అందులో కూడా ఈ సినిమా ఉంటుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సమయంలో కొందరు ఆస్కార్ ఈ సినిమాకు చాన్స్ తక్కువే అంటూ అభిప్రాయం చేస్తున్నారు. అంతర్జాతీయ యాడ్ ఏజెన్సీ తో ఒప్పందం కుదుర్చుకుని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ వారికి ఇవ్వడం వల్లే అంతర్జాతీయ స్థాయిలో భారీ ఎత్తున పబ్లిసిటీ నిర్వహించి అన్ని అవార్డులు వచ్చేలా చేశారంటూ రాజమౌళి టీం పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అంతర్జాతీయ మీడియాలో పబ్లిసిటీ చేయడం వల్లే మన ఆర్ఆర్ఆర్ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది, ప్రతి సినిమాకు పబ్లిసిటీ చేస్తేనే అవార్డులు లభిస్తాయి. కనుక పబ్లిసిటీ చేయడంలో తప్పేం లేదు.
కొందరు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేసి పబ్లిసిటీ దక్కించుకొని అవార్డులు పొందుతున్నారు, దీంట్లో ఏముంది గొప్ప విషయం అంటూ రాజమౌళి తీరుపై విమర్శలు చేస్తున్నారు. అలా విమర్శించడం కరెక్ట్ కాదు.. రాజమౌళి వల్ల తెలుగు సినిమాకు ఇండియన్ సినిమాకు గొప్ప పేరు వచ్చింది.