RRR: ఆర్ఆర్ఆర్ లో కీలకమైన సీన్ గురించి చెప్పిన రాజమౌళి తండ్రి

RRR: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. దర్మక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా, మల్టీస్టారర్ గా రూపొందుతుంది. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమా అప్డేట్స్ పై ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేస్తున్నారు రాజమౌళి. అలాగే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచారు. ఇప్పుడు రాజమౌళి తండ్రిపై రాజమౌళి కాస్త హర్ట్ అయ్యినట్లు తెలుస్తుంది. ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేసిన విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ప్రముఖ టీవీ ఛానెల్ షో కి ఇంటర్వ్యూకి వచ్చారు. ఈ నేపథ్యంలో 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో.. తెలుగు, తమిళ్, హిందీ భాషకు చెందిన స్టార్స్ సైతం ఈ సినిమాలో ఉన్నారు.

RRR

ఈ సినిమాలో అత్యంత కీలకమైన సీన్స్ గురించి ఓపెన్ అయ్యారు విజయేంద్రప్రసాద్. అందులో ఈ సినిమా ఎలా తెరకెక్కిందనే విషయాన్ని వివరంగా తెలిపారు. ఈ సినిమా గురించి మొత్తం డిటేల్డ్ గా తెలిసినా.. ఎంతో ఆసక్తిగా, ఆత్రుతగా చూసానంటూ భారీ అంచనాలు పెంచారు విజయేంద్రప్రసాద్. అన్నింటికంటే ముఖ్యంగా, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య వచ్చే ఫైట్ సీన్ గురించి చెప్పారు. ఈ సీన్ ఎంటైర్ సినిమాకే ఆయువుపట్టులాంటిదట. వారిద్దరి మధ్య వచ్చే సీన్ పై ఎన్నో అంచనాలుంటాయని తెలిపారు.

RRR

అందులోనూ ఈ సీన్ ను రాజమౌళి చాలా అద్భుతంగా తెరకెక్కించారట. అలాగే ఈ సినిమాలో సీత పాత్రలో యాక్ట్ చేసిన ఆలియా భట్ పాత్ర గురించి కూడా వివరాలు చెప్పారు. సినిమాకు సంబంధించి ఇన్ని సీక్రెట్స్ బయటపెట్టిన విజయేంద్రప్రసాద్ పై రాజమౌళి అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇంకెప్పుడు ఇలా చేయవద్దని కోరినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను డి.వి.వి. దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మేజర్ పనులు పూర్తయ్యాయి. కరోనా లాక్ డౌన్ తర్వాత ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి.