RRR Movie: ఆర్ఆర్ఆర్ కోసం త‌న హీరోలంద‌రిని ఒకే తెరపై తీసుకురాబోతున్న రాజ‌మౌళి

RRR Movie: రాజ‌మౌళి ఇప్పుడు ఈ పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా సుప‌రిచితం. బాహుబ‌లి వంటి పీరియాడిక‌ల్ చిత్రంతో సెన్సేష‌న్స్ క్రియేట్ చేసిన రాజ‌మౌళి ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ వంటి టాప్ హీరోలతో క‌లిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ కలగలుపుతూ మెగా, నందమూరి ఫ్యాన్స్ ఉర్రూతలూగేలా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం.

Rajamouli Brings His All Heroes For RRR Movie1
Rajamouli Brings His All Heroes For RRR Movie1

చాలా రోజులుగా ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం మ‌రి కొద్ది గంట‌ల‌లో అదిరిపోయే వీడియో విడుద‌ల చేయ‌నున్నాడు జ‌క్క‌న్న‌. రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో విడుద‌ల కానున్న ఈ వీడియో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచ‌డం ఖాయం అని అంటున్నారు. అయితే ఈ వీడియోతో సినిమా ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్ట‌నున్న జ‌క్క‌న్న రానున్న రోజుల‌లో మ‌రిన్ని అప్‌డేట్స్ ఇవ్వ‌నున్నారు.

రాజ‌మౌళి సినిమా ప్ర‌చారం ఏ స్టైల్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న ప్ర‌య‌త్నాలూ, ప్ర‌యోగాలూ – కొత్త త‌ర‌హాలో సాగుతుంటాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్ర ప్ర‌మోష‌న్ కూడా భిన్నంగా చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. చిత్ర ప్ర‌మోష‌న్ కోసం ఓ ప్ర‌మోష‌న‌ల్ గీతాన్ని రూపొందించ‌బోతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో న‌టీన‌టుల‌తో పాటు టెక్నీషియ‌న్స్ అంతా క‌నిపిస్తారు.

ఆడియోలో ఈ పాట ఉండ‌దు. కేవ‌లం ఎండ్ టైటిల్స్ పైనే రాబోతోంది. అంతేకాదు. రాజ‌మౌళి త‌న హీరోలంద‌రినీ ఈ పాట‌లో చూపించాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌మౌళితో క‌లిసి పని చేసిన ప్ర‌భాస్, ర‌వితేజ, సునీల్‌, నాని, నితిన్ వంటి వారు ఒకే స్క్రీన్‌పై క‌నిపించి సంద‌డి చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ పాట కోసం కీర‌వాణి అద్భుత‌మైన ట్యూన్ సిద్దం చేశాడ‌నే టాక్ వినిపిస్తుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను బడా నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన ఆలియా భట్ ఆడిపాడుతోంది. అజయ్‌ దేవగణ్‌, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.