SIRI VENNELA : సిరి వెన్నెల మృతితో శోక‌సంద్రంలో రాజ‌మౌళి.. ఇంటి అద్దె క‌ట్ట‌లేని ప‌రిస్థితుల‌లో ..

SIRI VENNELA : అద్భుత‌మైన సాహితి ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.ఆయ‌న మృతి సినీ ప‌రిశ్ర‌మ‌కు తీరని లోకాన్ని మిగిల్చింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేశారు.

Rajamouli about SIRI VENNELA death
Rajamouli about SIRI VENNELA death

సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాజమౌళి.. ఆయనతో కెరీర్ ఆరంభం నాటి గత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ భావోద్వేగ పూరిత సందేశం పెట్టారు. ”1996లో మేము అర్థాంగి అనే సినిమాతో సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. వచ్చే నెల నుంచి ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని స్థితి. అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యాన్నిచ్చి, వెన్నుతట్టి ముందుకు నడిపించినవి.

Rajamouli about SIRI VENNELA death
Rajamouli about SIRI VENNELA death

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులు కోవద్దురా ఓరిమి’ అన్న సీతారామ శాస్త్రి గారి పదాలు.. భయం వేసినప్పుడల్లా గుర్తు చేసుకొని పాడుకుంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేది. అప్పటికి నాకు శాస్త్రి గారితో పరిచయం చాలా తక్కువ. మద్రాసులో డిసెంబర్ 31వ తారీకు రాత్రి 10 గంటలకు ఆయన ఇంటికి వెళ్ళాను.

‘ఏం కావాలి నందీ’ అని అడిగారు. ఒక కొత్త నోట్ బుక్ ఆయన చేతుల్లో పెట్టి మీ చేత్తో ఆ పాట రాసివ్వమని అడిగాను. రాసి.. సంతకం చేసి ఇచ్చారు. జనవరి 1న మా నాన్నగారికి గిఫ్ట్‌గా ఇచ్చాను. నాన్న గారి కళ్ళలో ఆనందం, మాటల్లో కొత్తగా ఎగదన్నుకొచ్చిన విశ్వాసం ఎప్పటికీ మర్చిపోలేను.

సింహాద్రిలో ‘అమ్మయినా నాన్నయినా లేకుంటే ఎవరైనా’ పాట, మర్యాద రామన్నలో ‘పరుగులు తియ్’ పాట ఆయనకు చాలా ఇష్టం. అమ్మ నాన్న లేకపోతే ఎంత సుఖమో అని కానీ, పారిపోవటం చాలా గొప్ప అని కానీ ఎలా రాస్తాము నంది అని తిట్టి, మళ్ళీ ఆయనే ”I Like These Challenges’ అని మొదలు పెట్టారు. కలిసినప్పుడల్లా ప్రతి లైన్ నెమరు వేసుకుంటూ, అర్థాన్ని మళ్ళీ విపులీకరించి చెబుతూ, ఆయన స్టైల్‌లో గది దద్దరిల్లేలా, పక్కనే ఉంటే వీపును గట్టిగా చరుస్తూ ఆనందించేవారు.

ఆర్ఆర్ఆర్ దోస్తీ మ్యూజిక్ వీడియోకి లిరిక్ పేపర్‌లో ఆయన సంతకం చేసే షాట్ తీద్దామని చాలా ప్రయత్నించాము. కానీ అప్పటికే ఆరోగ్యం సహకరించక కుదర్లేదు. నా జీవిత గమనానికి దిశా నిర్దేశం చేసిన సీతారామ శాస్త్రి గారి కలానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.. రాజమౌళి” అని ఆయన పేర్కొన్నారు.