Raja Deluxe Movie : ప్రభాస్ ఫ్యాన్స్ కు వెరీ వెరీ గుడ్ న్యూస్
NQ Staff - January 18, 2023 / 09:46 AM IST

Raja Deluxe Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అయింది. అధికారికంగా ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకున్నా కూడా సినిమాకు సంబంధించిన పలు విషయాలు మీడియాకు లీక్ అవుతున్నాయి.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను దాదాపుగా 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ సినిమాలో ఒక పాడుబడ్డ థియేటర్ అత్యంత కీలక పాత్ర పోషించబోతోందట, అందుకోసం చాలా ఖర్చు చేసి మరీ ఆ థియేటర్ సెట్ వేసినట్లుగా సమాచారం అందుతుంది.
నిన్న మొన్నటి వరకు ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా వచ్చే సంవత్సరం విడుదల అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 2023 సంవత్సరంలోనే ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.
సమ్మర్ వరకు సినిమా యొక్క చిత్రీకరణ పూర్తి చేసి ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నిర్వహించబోతున్నారట. దాదాపు ఆరు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని మారుతి కాంపౌండ్ నుండి సమాచారం అందుతుంది.
మొత్తానికి ఇదే సంవత్సరంలో ప్రభాస్ సలార్ మరియు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలు రాబోతున్నాయి. ఈ వార్త కచ్చితంగా ప్రభాస్ అభిమానులకు వెరీ వెరీ గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు.